
Teachers
చిన్న బోనాల, ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి
మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని చిన్న బోనాల మరియు ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా బోధన తీవ్రంగా ప్రభావితమవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలంటూ 10 వార్డ్ మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ చిన్న బోనాల అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ మరియు ముష్టి పెళ్లి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, DEO, MEO లకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ..
చిన్న బోనాల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు కేవలం 4 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా, ఇద్దరు డిప్యూటేషన్‌పై, ఒకరు రిటైర్డ్ అయ్యారు. అలాగే ముష్టిపల్లి ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జీవో నెం.25 ప్రకారం ఈ సంఖ్యకు తగినట్టు అదనపు టీచర్లను నియమించాలి అని ప్రజావాణిలో అధికారులకు తెలిపారు.ఈ వినతిపత్ర సమర్పణలో బండారి భాగ్య, గుగ్గిల లావణ్య లలిత, బి.వినోద్, నరాల లత, సరోజ,అనన్య,లింబ్బవ్వ,సురేష్,మహేష్, బాబు,పరశురాములు, రమేష్, శివ, కుమార్, అనిల్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.