Teachers and Students Support Injured Student Vignesh
జి విగ్నేష్ కు అండగా నిలిచిన ఉపాధ్యాయులు, విద్యార్థులు
రూ.11,116 వేల ఆర్థిక సాయం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రానికి చెందిన ఇంటర్ సెకండియర్ బైపిసి విద్యార్థి గుర్రం విగ్నేష్ గత నెలలో పీఎం శ్రీ మోడల్ పాఠశాల ప్రాంగణంలో జరిగిన క్రీడల్లో గాయపడగా అతనికి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు అండగా నిలిచారు. మంగళవారం విద్యార్థి ఇంటికి వెళ్లి రూ.11,116 వేల ఆర్థిక సాయం అందజేశారు. విద్యార్థికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి.ఎం శ్రీ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి,
టి.రజిత
డాక్టర్ కె శ్రీ సుధ
ఎస్ శంకర్
సిహెచ్ మహేష్
.బి.రమేష్
ఎండి మసూద్ పాషా పి ఈ టి మమత జి వేణు
విద్యార్థులు
హెడ్ బాయ్ జస్వంత్
హెడ్ గర్ల్ సింధూజ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
