కారేపల్లి లో నాయకులు కార్యకర్తలు విజయెత్సవ సంబురాలు.
కారేపల్లి నేటి ధాత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన ఎన్నికల్లో టిడిపి భారీ విజయం సాధించిన సందర్భంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రములో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మండెపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకోని స్విట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఫ్ మండల ప్రెసిడెంట్ కొత్త వెంకట్ సింగరేణి గ్రామ అధ్యక్ష కార్యదర్శులు డి. కొండల్ రావు చిన్ని శ్రీను జిల్లా యూత్ నాయకులు గంగరబోయిన
శ్రీనివాసరావు సక్రు ముప్పవరపు వెంకయ్య ఆల్ల సత్యనారాయణ చెరుకూరి రామారావు వై. మధు డి. వెంకన్న యాదగిరి బి.ముఖర్జీ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని బాణా సంచా కాల్చి స్వీట్స్ తినిపించుకొని సంబరాలు చేసుకోవటం జరిగింది.