జిల్లా ఇంచార్జ్ మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తిరుపతి టిడిపి నేతలు
తిరుపతి(నేటిధాత్రి:
రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకొని రేపల్లెలో ఉన్న మంత్రిని శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబి శ్రీనివాస్, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, యూనిట్ ఇంచార్జ్ రఘురాం లు కలసి శాలువులతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మంత్రి సత్యప్రసాద్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి
సు పరిపాలనను జిల్లా ప్రజలకు అందించాలని వారు ఆకాంక్షించారు.
