
"TDP Extends Support to Narsapur Hunger Strike"
రిలే నిరాహారదీక్ష కు టీడీపీ సంపూర్ణ మద్దుతు
ఎమ్మెల్యే,జీఎం స్పందించాలి టీడీపీ డిమాండ్
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సపూర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు శనివారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సపూర్ చెక్ పోస్ట్ వద్ద హై లెవల్ బ్రిడ్జి, లచ్చుగుడెం దారిలో నూతన కల్వర్టు నిర్మాణం అలాగే నర్సపూర్ నుండి బెజ్జల రోడ్డుకు అటవీశాఖ అనుమతి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలోతాండూర్ మండల తుడుం దెబ్బ అధ్యక్షులు కుర్సెంగ బాబురావు, సోయం సురేష్, ఆత్రం బాదిరావు, సోయం వంశీకృష్ణ,ఆత్రం సురేష్ తదితరలు గ్రామస్తులు పాల్గొన్నారు.