పూర్తిగా తెలుగు దేశంగా మారిన టి. కాంగ్రెస్‌.

https://epaper.netidhatri.com/

`చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.

`గత రెండేళ్ళుగా రేవంత్‌ స్కెచ్‌ గురించి చెబుతున్న నేటిధాత్రి.

`రేవంత్‌ రెడ్డి అడుగులు ఎలా వుంటాయన్నది చెప్పింది.

`అక్షరాల ఇప్పుడు అదే జరుగుతోంది.

`కాంగ్రెస్‌ నిండా మునిగి…పసుపు రంగు తేలుతోంది.

`కాంగ్రెస్‌ సీనియర్లంతా బైటకు…

`తెలుగు దేశం సీనియర్లంతా కాంగ్రెస్‌ కు

`తెలుగు దేశం బ్యాచ్‌ కు పంపకాలు.

`రేవంత్‌ రెడ్డి అనుచరులందరికీ టిక్కెట్లు.

` కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం.

`అసలు కాంగ్రెస్‌ నేతలకు శఠగోపం.

`కాంగ్రెస్‌ ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నం.

`సమైక్యాంధ్ర కోసం పని చేసిన చంద్రబాబు ను తరుముతున్న అక్కడి రాజకీయం.

` తలదాచుకున్న చోట రాజకీయం కోసం చంద్రబాబు ఆరాటం.

`రేవంత్‌ నేతృత్వంలో తెలంగాణ చీకటి మయం.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రేవంత్‌రెడ్డి పక్కా బ్లేమ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. తాను మాత్రం సేఫ్‌ రాజకీయాన్ని ఎంచుకున్నాడు. కాంగ్రెస్‌ను బ్లైండ్‌గా మార్చేశాడు. మొత్తం పార్టీని నిండా ముంచేందుకు కంకణం కట్టుకున్నాడు. కాంగ్రెస్‌ పార్టీని ఆఖరు దశకు, అవసాన దశకు తెచ్చేశాడు. రేవంత్‌రెడ్డి ఇలాగే చేస్తాడని సీనియర్లకు ముందే తెలుసు. ముందు నుంచి మొత్తుకుంటూనేవున్నారు. అయినా అదిష్టానం వినిపించుకోలేదు. ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ బలపడిరదే గాని, రేవంత్‌ మూలంగా కాదన్నది పార్టీ అధిష్టానం గుర్తించలేకపోతోంది. కేవలం రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడిగా వుండడం మూలంగా ఆయన ద్వారా చేరికలు జరుగుతున్నాయే కాని ఆయన వల్ల కాదు. పైగా ఆయనకూడా పనగట్టుకొని పాత తరం తెలుగుదేశం నేతలందరినీ కాంగ్రెస్‌లోకి తీసుకురావడం వెనుకు వున్న ఆంతర్యం సీనియర్లందరకీ తెలుసు. ఇప్పుడు వాళ్లపెత్తనమే సాగుతుందన్నది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని నేటిధాత్రి ఎప్పటి నుంచో చెబుతూనే వుంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఆయన అడుగుల గురించి చెప్పింది. ఆ తర్వాత ఆయన ప్రతి అడుగును నిరూపిస్తూ వచ్చింది. ఆయన ఆలోచనలు ఎలా వున్నాయన్నది నాటి నుంచే నేటిధాత్రి చెబుతూనే వస్తుంది? ఖచ్చితంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను మింగేస్తాడు అన్నది ఇప్పుడు అక్షరాలు నియమయ్యే దశకు దాదాపు వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అన్నది లేకుండాపోవడం ఖాయం. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మొదటి లిస్టు చూస్తేనే అర్ధమౌతుంది. ఇక తాజగా నిజామాబాద్‌కు చెందిన మండవ వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందని తమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు, బిఆర్‌ఎస్‌ నుంచి ఈటెలతో వెళ్లిన ఏనురు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతోనే అసలు రంగు పూర్తిగా బైటపడిరది. కాంగ్రెస్‌ ఆకుపచ్చ రంగు కాస్త పసుపు రంగులోకి మారిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేదో సినిమాలో పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ అంటూ చెప్పినట్లే, పూర్తిగా తెలుగుదేశంగా మారిపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు కనిపిస్తోంది. భవష్యత్తులో కాంగ్రెస్‌ తెలంగాణలో కనుమరుగౌతుంది. కాదు..రేవంత్‌ స్చెచ్‌తో అంతరించిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అన్నది కూడా సుస్పష్టమే. తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో కంగ్రెస్‌ను ప్రజలు పది అడుగుల లోతున పాతేశారు. ఇక లేవకుండా చేసేశారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను సమాధి చేసే బాధ్యత రేవంత్‌రెడ్డి తీసుకున్నారు. చంద్రబాబుకు తెలంగాణ రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. రెండు కళ్ల సిద్దాంతం, రెండు కొబ్బరి చిప్పల సిద్దాంతం పైకి చెప్పి, సమైక్యాంధ్ర నినాదం వినిపించింది చంద్రబాబు. తెలంగాణ రావడంతోనే తన రాజకీయ జీవితం చీకటిమయమైందన్న భావనలో చంద్రబాబు వున్నారు. ఇక ఆంధ్రాలో తన రాజకీయం చెల్లేలా లేదు. చంద్రబాబు పార్టీకి మనగడ లేదు. అందుకే చంద్రబాబుకు తెలంగాణ రాజకీయం మీద గత ఎన్నికల్లోనే కన్నుపడిరది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని కుట్ర చేశాడు. భంగపడ్డాడు. తెలంగాణ నుంచి తరిమేయబడ్డాడు. ఆ పగతో రగిలిపోతున్నాడు. చంద్రబాబు ఆదేశించాఉ. రేవంత్‌ ఆచరిస్తున్నాడు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్‌రెడ్డి ఏదైనాచేస్తాడు. అందుకే ఆ కార్యక్రమం మొదలుపెట్టారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలను ఒక్కొక్కరిగా సాగనంపుతూ వస్తున్నాడు. పాత తెలుగుదేశం నాయకులందిరనీ కాంగ్రెస్‌లో చేర్చుతూ వస్తున్నాడు. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీలో తెలుగుదేశం శ్రేణులతో నింపుతున్నాడు. తన మాటే చెల్లుబాటు అయ్యేలా చూసుకుంటున్నాడు. అదను చూసి, అవకాశం చూసి, తన చేతుల్లో పూర్తిగా హస్తం బంధీ చేసుకోవాలనుకుంటున్నాడు.. ఆ తర్వాత చంద్రబాబు చేతుల్లో పెట్టాలని చూస్తున్నాడు. ఇది కూడా కాంగ్రెస్‌ సీనియర్లకు ఎప్పుడో అర్ధమైంది. కాని డిల్లీ పెద్దలకు అర్ధం కావడం లేదు. రేవంత్‌ చేసే ఆర్ధిక పరిహారాలు తప్ప, రేవంత్‌ చేస్తున్న కుట్ర వ్యవహారాలు జాతీయ నాయకులకు పట్టడం లేదు. వాళ్లు పట్టించుకోవడం లేదు. పైగా సీనియర్లంతా కట్టగట్టుకొని వెళ్లి చెప్పినా డిల్లీ పెద్దలు వినిపించుకునేలా లేదు. అలా వారిని కూడా మాయి చేసి, నాపై ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవద్దన్న సంగతి ముందే చెప్పి కదిలంచలేని ధ్వజస్థంభమైపోయాడు. సీనియర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. వారిని రాజకీయంగా కనుమరుగు చేస్తున్నాడు. అనుకున్నందంతా సాఫీగా సాగితే, గెలిచిన నాయకులంతా ఇప్పటి వరకు ఎలా వలస వెళ్లారో? రేపు అదే విధంగా అందరూ తెలుగుదేశం పేరుతో కొత్త దందా మొదలుపెడతారు. గుండుగుత్తగా వెళ్లి, కాంగ్రెస్‌ను అసెంబ్లీలో లేకుండా చేస్తాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎల్పీని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లే, కాంగ్రెస్‌ను తెలుగుదేశంలో విలీనం చేయడమే రేవంత్‌రెడ్డి ముందున్న ప్రధానకర్తవ్యం. మళ్లీ చంద్రబాబు నాయకత్వాన్ని తెలంగాణ మీద రుద్దడం. ఇదే జరగాలని రేవంత్‌ కంకణం కట్టుకున్నాడు. అమలు చేస్తున్నాడు. ఆచరణలో అందరిని కలుపుకుంటూ పోతున్నాడు. కాంగ్రెస్‌లో పాత వాసన లేకుండా చూసుకుంటున్నాడు.
పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుడు కూడా పార్టీ బైటకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది.

గడచిన నలభై సంవత్సరాలుగా ఆయన పార్టీకోసం పనిచేస్తూ వస్తున్నారు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా, రేవంత్‌లాగా అంతటి దిగజారిన వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. రాజకీయాల్లో అలాంటి వ్యాఖ్యలు సమర్ధినీయంకాదు. ఆహ్వానించకూడదు. ఎవరైనా ఖండిరచాల్సిందే. అయితే తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడైన పొన్నాలను కూడా సాగనంపడం అంటేనే రేవంత్‌ రెడ్డి ఎంత పకడ్భంధీగా పథకం రచించిండో అర్ధం చేసుకోవచ్చు. ఇక అదే జనగామ జిల్లాకు జంగా రాఘవరెడ్డి అధ్యక్షుడుగా వుండేవారు. ఆయనను పక్కకు తప్పించి, కొత్తగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని తెచ్చిపెట్టారు. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చుపెట్టారు. ఒకనాడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో వెలుగువెలిగిన జంఘారాఘవవరెడ్డి లాంటి వారి రాజకీయం తుంచేసేశాడు. ఇలా చాల మంది నాయకులు రాజకీయ భవితవ్యాన్ని రేవంత్‌రెడ్డి ప్రశ్నార్ధకం చేస్తూ వస్తున్నాడు. ఉప్పల్‌ నియోజకవర్గంలో రాగిడిలక్ష్మారెడ్డి గడచిన ముప్పైఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నాడు. ఆయనకే టికెట్‌ అని ముందు మాట ఇచ్చారు.లిస్టులో పేరు లేకుండా మరొకరికి ఇచ్చారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి మీద రేటెంత రెడ్డి అంటూ విమర్శలు వస్తూనే వున్నాయి. ఎంతో మంది సీనియర్‌ నాయకులకు మొదటి లిస్టులో పేరు లేకుండాపోయింది. ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా వున్నాయి. అందుకు సాక్ష్యంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి పనిచేసిన వాళ్లను వెర్రివెంగళప్పలను చేసేస్తున్నాడు. ఇక తాజాగా పొన్నాల లక్ష్యయ్యపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడంటే పార్టీ అదికారంలోకి వస్తే ఆయన వ్యవహరశైలి ఎలా వుంటుందో అన్న భయం మొదలైంది. మొదటి లిస్టులోనే నమ్మిన వారిని మోసం చేసినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతే కాదు సాక్ష్యాత్తు తన సొంత నియోజకవర్గం లోనే తన అనుచరుడుగా వున్న నాయకులు రేవంత్‌ను ఎలా గెలుస్తావో చూస్తా? అంటూ సవాలు విసురుతున్నాడు. ఏది ఏమైనా రేవంత్‌ రాజకీయంలో నిజాయితీ కనిపించడం లేదన్నది చాల మంది అభిప్రాయం. తనకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వున్నా, చంద్రబాబు కోసం ఎలాంటి త్యాగమైన చేస్తాడని, మళ్లీ తెలంగాణను చంద్రబాబు చేతుల్లో పెట్టడానికి కూడా రేవంత్‌ వెనుకాడడన్న అపవాదు వుంది. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!