రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన తవక్కల్ విద్యార్థిని

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (జోనల్ స్థాయి) బాలికల అండర్ 17 కరాటే పోటీలు మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నిర్వహించగా మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలలో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన తవక్కల్ పాఠశాలలో విద్యనభ్యసించే సిహెచ్ శ్రీహర్షిత జోనల్ స్థాయిలో విజయం సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయింది. శ్రీహర్షిత రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన నేపథ్యంలో తవక్కల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్, ప్రిన్సిపాల్ రామకృష్ణ లు విద్యార్థిని ని అభినందించారు.కరాటే మాస్టర్ జుల శ్రీనివాస్ ను సైతం అభినందించారు. విద్యార్థినీ విద్యార్థులు ప్రస్తుత సమాజంలో చదువు తో పాటు క్రీడలలో కూడా రాణించాలని పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!