Demand to Upgrade BC Hostel in Chityala
బిసి హాస్టల్ ను అప్ గ్రేట్ చేయాలని బీసీ వెల్ఫేర్ అధికారిని కలిసిన తౌటం నవీన్.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికుమార్ కిరణ్ ని శుక్రవారం రోజున తౌటం నవీన్ మర్యాద పూర్వక ముగా కలిశారు ఈ సందర్బంగా గ్రామం లో ఉన్న హాస్టల్ సమస్యల పైన చర్చించారు. చిట్యాల మండల కేంద్రం లో ఉన్న బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ ని ప్రీ మెట్రిక్ నుండి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గా అప్గ్రేడ్ చేసినట్లు అయితే హాస్టల్ లో ఇంటర్, డిగ్రీ చదువుకొనే పిల్లలు కూడా బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉండడం జరుగుతుంది*. దీని ద్వారా ఇంటర్ మరియు డిగ్రీ పిల్లలకు కూడా హాస్టల్లో అవకాశం కలిపిస్తే వారు కూడా చదువుకోని గొప్ప ప్రయోజకులు అవుతారు కాబట్టి తప్పకుండ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గా అప్ గ్రేడ్ చేయాలి అని వారికీ కోరడం జరిగింది అని నవీన్ తెలిపారు.బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికుమార్ కుమార్ గారు ఈ సందర్బంగా సంబంధిత పై అధికారులతో మాట్లాడి తప్పకుండ అప్ గ్రేడ్ చేసేలా కృషి చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది అని వారు పేర్కొన్నారు. రాబోయే ఇంటర్, డిగ్రీ వరకు హాస్టల్ అప్ గ్రేడ్ ని తప్పకుండ చేస్తాం అని పిల్లల భవిష్యత్తు కి చిట్యాల గ్రామ పంచాయతీ కృషి చేస్తుంది అని నవీన్ పేర్కొన్నారు.
