కోహిర్లో కల్తీ రాజ్యం
◆:- టిఫిన్ సెంటర్లలో కల్తీ నూనెలు, పట్టింపు లేని అధికారులు.
◆:- ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం, తినేది ప్రాణాంతకం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ కోహిర్: సంగారెడ్డి జిల్లా కోహిర్ పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లు. హోటల్స్‌లో నాసిరకం, కల్తీ నూనెతోనే దోసె, ఇడ్లీ, పూరీ, బొండం, ఉప్మా వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఒక్కసారి వాడిన నూనెనే రెండు, మూడు రోజుల పాటు మళ్లీ మళ్లీ వేడి చేసి ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జనంతో కిటకిటలాడే ఈ టిఫిన్ సెంటర్లు కల్తీ నూనె వాడుతూ పదేపదే వేడి చేసిన నూనె వినియోగిస్తున్నారని నూనె వేసినప్పుడు నల్లటి పొగలు కక్కుతున్నాయని.
అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు.
కోహిర్ మండలంలో గత కొంతకాలంగా ఆహార భద్రతా శాఖ అధికారులు ఒక్కసారి కూడా తనిఖీలు నిర్వహించలేదని, ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు నిమ్మకు నీరు పోసినట్టు ఉన్నారని కల్తీ ఆహారాలతో ప్రజలు అనారోగ్యం పలు అవుతున్న అధికారులు మాత్రం ఎలాంటి స్పందన లేదని స్థానికులు ప్రశ్నించారు. పదేపదే వేడి చేసిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్, కార్సినో జెనిక్ పదార్థాలు ఏర్పడి క్యాన్సర్, గుండె జబ్బులు, లివర్ డ్యామేజ్ వంటి ప్రమాదాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నా ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోజూ ఈ టిఫిన్ తినే కార్మికులు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ఆహార భద్రత బృందం ఆహార భద్రతా శాఖ బృందం తక్షణం దాడులు నిర్వహిం చాలి. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్‌పై కేసులు పెట్టి సీజ్ చేయాలని ప్రజలు అంటున్నారు. ఆరోగ్యం అమూల్యం.. డబ్బు ఆదా చేసుకునే పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ టిఫిన్ సెంట ర్లపై అధికారులు వెంటనే చర్య తీసుకుంటారా? అన్నది కోహిర్ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రశ్న.
