వరంగల్ టాటా కంపెనీ టిబిఎం శ్రీధర్
#నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని చంద్రుగొండ గ్రామానికి చెందిన కందిమల్ల రాజు తన వ్యవసాయ క్షేత్రంలో టాటా కంపెనీ ఈషా పత్తి విత్తనాలతో పత్తి సాగు చేయగా అధిక దిగుబడులు సాధించగా టాటా ఈషా కంపెనీ వరంగల్ టిబిఎం శ్రీధర్ పత్తి రైతు కందిమల్ల రాజును మరియు విత్తన వ్యాపారి ఇమ్మటి శ్రీనివాసును శాలువాలతో సన్మానించారు. అనంతరం టాటా కంపెనీ ఈషా వరంగల్ టీబీఎం శ్రీధర్ మాట్లాడుతూ టాటా కంపెనీ ఈషా పెద్ద రకం పత్తి కాయలు కలిగి ఉంటుందని అధిక బరువు ఉంటుందని ఆకు మీద నుగు ఉండటంవల్ల దోమకాటు రాకుండా ఉంటుందని టాటా కంపెనీ విత్తనాల ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ఎండిఆర్ వీరస్వామి, రైతులు సంగని మధు, ఎరుకల రంజిత్, బట్టు దేవేందర్, దొంగరి వీరన్న, పొన్నాల కృష్ణ, నల్లపు రాజేష్, దొనికి రవి, బోలు గొడ్డు సురేష్, చంద్రుగొండ ,గొల్లపల్లి, బంజేపల్లికి సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు.