లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి లక్షట్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్ లో ఒక షెడ్ లో నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి జామున టాస్క్ ఫోర్సు ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది రాకేష్, రాజు తో కలిసి తనిఖీలు నిర్వహించగా 15 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొరికిన పిడియస్ రైస్ సత్య సాయి నగర్ కాలనీకి చెందిన గుర్రాల కిషన్ గా గుర్తించారు. తదుపరి విచారణ లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది.