నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత
కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.
సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.
మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.
వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..
నేటిధాత్రి నర్సంపే;
నర్సంపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వ నిషేధిత అక్రమ అంబర్,గుట్కా, తంబాకు నిలువలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు కిరాణం దుకాణాలు, పాన్ షాపులు, వివిధ హోల్ సేల్ దుకాణాలలో అక్రమ అంబర్,గుట్కాలు నిల్వలను టాక్స్ ఫోర్స్ అధికారులు, పోలీసుల దాడుల్లో లభ్యం అవ్వడం కొద్దిరోజుల తర్వాత ఆ అమ్మకాలు మరింత పెరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. నర్సంపేట పట్టణంలో ఒక కిరాణంలో దాడులు నిర్వహించి సుమారు 1,59 వేల రూపాయల విలువగల అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ తెలిపారు.
నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీపి మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు. ఇలాంటి అక్రమ నిషేధిత అంబర్, గుట్కాలను నిలువచేసిన,అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.