నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో చోటుచేసుకుంది. గిర్నిబావి గ్రామంలోని కిరాణా షాపుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు చేరింది. ఈ నేపథ్యంలో సదరు షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేశారు.ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల షాపుల నుండి రూ.75, 950 విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. షాపు యజమానులు రామోజీ, రాజు, ప్రభాకర్ లను మద్యంతో సహా దుగ్గొండి పోలీసులకు అప్పగించారు. అక్రమ మద్యం అమ్ముతున్న వారిపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెల్ట్ షాపుల్లో మద్యం నిల్వ చేయడం, అమ్మకాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఏఎస్ఐ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు , దుగ్గొండి ఏఎస్సై అనిశెట్టి విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది గుండెబోయిన వీరస్వామి గౌడ్ పాల్గొన్నారు.