నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి కార్యక్రమంలో భాగంగా టాస్క్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు టాస్క్ ప్రోగ్రాంలో నమోదు చేసుకొని నేటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపున్యాలను,వ్యక్తిత్వ వికాసాన్ని , కమ్యూనికేషన్ స్కిల్స్,అలాగే ఎంప్లాయాబిలిటీ స్కిల్స్ ను పెంచుకోవాలని కోరారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నెగ్గాలంటే తమ స్కిల్స్ ను పెంచుకొనే ఆవశ్యాకత ఎంతైన ఉన్నదనీ, ఇoదుకు టాస్క్ లో తప్పక నమోదు చేసుకొవలనీ కొరారు.టాస్క్ కన్వీనర్ ఎం ఎం కె రహీముద్దీన్ టాస్క్ నమోదుకు సంబందించిన వివరాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. భైరి సత్యనారాయణ,అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, మరియు స్టాఫ్ సెకట్రరీ డాక్టర్.ఎం సోమయ్య ,అధ్యాపకులు డాక్టర్ రాంబాబు,డాక్టర్ భద్రు భూక్య, డాక్టర్ జె.రాజీరు, ఎస్.రజిత, ఆర్.రుద్రాణి, డాక్టర్ డి.సంధ్య,డాక్టర్.బి.గాయత్రి, ఆర్.గణేష్, డాక్టర్.వి.పూర్ణచందర్, బి.వీరన్న, నిజాము, బి.రమేష్, బి.గ్లోరి, ఆర్.మాధవి, జి.అనిత, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.