
President Matli Prasad Reddy
నేడు 26,27 తేదీ లలో టేప్ ఎక్స్పో 25 ఎగ్జిబిషన్
టేప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మట్లి ప్రసాద్ రెడ్డి
తిరుపతి(నేటి ధాత్రి)జూలై 25:
తిరుపతి పట్టణ ప్రజలు భవన నిర్మాణం అవగాహన కొరకు ఎయిర్ బైపాస్ రోడ్డు లోని పి.ఎల్. ఆర్,కన్వెన్షన్ హాల్ నందు ఎక్స్పో 25 ఎగ్జిబిషన్ ఈనెల 26 ,27 తేదీలలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు టేప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మట్లి ప్రసాద్ రెడ్డి తెలిపారు . శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రెవిన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రి కొల్లు రవీంద్ర, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ వరప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం పేద మధ్యతరగతి భవన నిర్మాణం కొరకు ఎటువంటి సామాగ్రి ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న నిపుణుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ చైర్మన్ టి. వెంకటేష్ బాబు , జనరల్ సెక్రెటరీ బుసా షణ్ముగం, ట్రెజరర్ సందీప్, వైస్ ప్రెసిడెంట్లు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బంగారయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, వెల్ఫేర్ సెక్రెటరీ సురేష్ పాల్గొన్నారు.