సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ
స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ సార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న విద్యార్థులు.
“సర్ సివి రామన్ యంగ్ జీనియస్” ప్రశంస పత్రాలు అందుకున్న సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థులు సాత్విక్ రాజ్, సిద్ధార్ధ్ రాజ్.
వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ దేశాయిపేట రోడ్డులోని సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థులు కందికొండ సాత్విక్ రాజ్ 6త్ క్లాస్, కందికొండ సిద్ధార్థ రాజ్ 4త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఇటీవల రాసిన సీవీ రామన్ టాలెంట్ పరీక్షలో భాగంగా, “సర్ సివి రామన్ యంగ్ జీనియస్” ప్రశంస పత్రాలను స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ సార్ చేతుల మీదుగా అందజేశారు. సంఘమిత్ర టెక్నో స్కూల్లో చదువుతున్న విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ టాలెంట్ టెస్ట్ లో ర్యాంక్ లు సాధిస్తూ, సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు సైతం ప్రతి యేడాది అందుకోవడం గర్వకారణమని సంఘమిత్ర టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ పేర్కొన్నారు. నగర ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నత విద్యను అందిస్తున్న సంఘమిత్ర టెక్నో స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ కు, స్కూల్ టీచర్లకు అభినందనలు తెలియజేశారు విద్యార్థుల తల్లిదండ్రులు.