Patlolla Sangareddy Takes Oath as Yousufpur Sarpanch
యూసుప్ పూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం.
◆-: సర్పంచిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పట్లోల్ల సంగారెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల్ యూసుప్ పూర్ గ్రామ పంచాయతీ లో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు పొందిన అభ్యర్థి పట్లోళ్ళ సంగారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ముందుగా పంచాయతీ కార్యదర్శి సంగీత సర్పంచ్ కు వార్డ్ మెంబర్సకు అందరికి ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞ చేయించారు. నూతనంగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పట్లోళ్ళ సంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని పేద బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
