అర్హులైకే మాత్రమే రుణాలు అందేలా చూడాలి..
పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06:
ప్రభుత్వం తరపున స్వయం ఉపాధి పథకాలకు అందించనున్న వివిధ కార్పొరేషన్ రుణాలు అర్హులకు మాత్రమే అందేలా చూడాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేషన్ రుణాలకు అందుతున్న అర్జీలను పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలన్నారు.అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక గంగన్న శిరస్సు ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ పూర్తి కావడంతో అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం టౌన్ హాల్, ఎస్టీపీ ప్రాజెక్టు తదితర పనులపై చర్చించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, టిపిబిఓ ఇందిరా,ఏఈ స్నేహ ప్రియా, సర్వేయర్ ఆంజనేయులు, మెప్మా మేనేజర్ బాబా తదితరులు ఉన్నారు.