# మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో అభయహస్తం పథకాన్ని అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం నర్సంపేట పట్టణంలో 20,21, డివిజన్ లలో ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపాలిటీ కనిషనర్, ప్రజాపాలన అధికారులు ఎంఈఓ రత్నమాల, ఏఓ కృష్ణకుమార్ లు అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు.ముఖ్య అతిథిగా హాజరైన అనంతరం వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ పథకాల అమలులో అక్రమాలకు తావులేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని రేపటి వరకు ప్రజలకు అప్లికేషన్ అవకాశం ఉందని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఇలాంటి ప్రజాపాలన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.దరఖాస్తు చేసుకొని వారు మళ్లీ మళ్లీ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని ఉంటే అభ్యంతరం ఏమీ ఉండదని దానికోసం మీసేవ సెంటర్ల వద్ద ఆధార్ సెంటర్ ల వద్ద గుమ్మి కూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయని నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు పథకాలు అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్పీలు మున్సిపాలిటీ అధికారులు, మాజీ వార్డు మెంబర్ గాజుల రమేష్, 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్ పట్టణ కార్యదర్శి కొంగీస మదన్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ,సాయి పటేల్ ,ఉత్తంకుమార్, జిజుల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.