వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.

కింగ్ షోటోకాన్ 26వ వేసవి శిక్షణ శిబిరాల బ్రోచర్లను ఆవిష్కరించిన..

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

వేసవి కరాటే శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కింగ్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఆధ్వర్యంలో వచ్చేనెల 2 నుంచి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 26వ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాల బ్రోచర్లను గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి కింగ్ షోటోకాన్ జహంగీర్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో వేసవిలో ఉచిత కరాటే శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. పట్టణంలోని విద్యార్థులు, యువకులు కరాటే శిబిరంలో పాల్గొని శిక్షణ పొందాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెల్ఫ్ డిఫెన్స్, ఫిట్ నెస్ పై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కింగ్ షోటో కాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ ఈ ఏడాది 26వ వేసవి ఉచిత కరాటే శిక్షణా శిబిరాలను జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణ, షాసాబ్ గుట్టలోని అల్ నూర్ స్కూల్లో వచ్చేనెల 2 తేదీ నుంచి జూన్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు శిబిరాలు ఉంటుందని, శిబిరంలో కరాటే, కిక్ బాక్సింగ్, జూడో, బాక్సింగ్, యోగా, సెల్ఫ్ డిఫెన్స్, ఫిజికల్ ఫిట్ నెస్ పై శిక్షణ అంజేస్తామని తెలిపారు. శిక్షణ అనంతరం బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. మిగతా వివరాల కోసం 9849301171 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ సంఘం ప్రతినిధి చెన్న వీరయ్య, నాయకులు సీజే బెనహర్, సాదుల్లా జునేది, శాంతన్న యాదవ్, ప్రవీణ్ కుమార్, సీనియర్ కరాటే విద్యార్థి ఆర్ష్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!