
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అమ్మ కోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిణి డాక్టర్ నవత సూచించారు. అమ్మ కోసం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె గర్భిణీ స్త్రీలతో పాటు ఓపి పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ అందజేశారు. అనంతరం ఆమె గర్భిణీ స్త్రీలనుద్దేశించి మాట్లాడారు. స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గురువారం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్స్ అందజేయడం జరుగుతుందన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేసి మెడిసిన్స్ అందజేయడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.