మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఫిబ్రవరి 12న నిర్వహించూ జాతీయ అప్రెంటిస్ షిప్ మేళాను ఐటిఐ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జి దేవానంద్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అప్రెంటిస్ షిప్ మేళాకు హైదరాబాద్ నుండి ఎంఎన్సి ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలతోపాటు స్థానిక కంపెనీలు సైతం హాజరవుతున్నాయని తెలిపారు. ఐటిఐ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు చేసుకొని, వారి రెస్యూమ్, బయోడేటా ఫాం, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ, ఐటిఐ మార్కుల మెమో, ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, రెండు ఫోటోలు ఇతర ధృవీకరణ పత్రాలతో అప్రెంటిస్ మేళాకు హాజరు కావాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్ జి దేవానంద్ 7013846573, కళాశాల సిబ్బంది పి సునీల్ బాబు 9154549697 లను సంప్రదించాల్సిందిగా తెలిపారు