
Special Aadhaar Camp in Chandurthi Mandal
ఆధార్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోండి : మండల విద్యాధికారి వినయ కుమార్
చందుర్తి’ నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆధార్ క్యాంపును మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తేది 14.10.2025 మంగళ వారం నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయడం, నూతన ఆధార్ కార్డు నమోదు, ఆధార్ కార్డులో పేరు మార్చుట, వేలిముద్రలు మార్చటం, మొబైల్ నెంబర్ మార్చుట, అడ్రస్ మార్చుట, పుట్టిన తేదీ మార్చుట, ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయడం, ఆధార్ కార్డుకు పాన్ కార్డు మరియు ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానం చేయుట వంటి అన్ని అవకాశాలు ఉన్నాయి.
ఈ ఆధార్ క్యాంపు సనుగుల ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే ఒకటి కొనసాగుతుందని, మంగళ వారం నుండి చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మరో క్యాంపు మొదలవుతుందని తెలిపారు.
మండలం లోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేందుకు, ఆధార్ కార్డు లేని విద్యార్థులకు కొత్త ఆధార్ కార్డు తీసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అని, ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.