Goud Association Seeks Action on Illegal Belt Shop
బెల్ట్ షాపు యజమాన్యంపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి..
*గౌడ సంక్షేమ సంఘం సభ్యుల డిమాండ్.
తిరుపతి(నేటిధాత్రి) నవంబ
ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన వైన్ షాప్ ని బెల్టు షాప్ యజమానులు కొడుతున్నారని గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘ సభ్యులు వాపోయారు. ఈ ప్రభుత్వంలో మద్యం షాపు టెండర్ ద్వారా 28 మంది దరఖాస్తు చేసుకోగా అత్తరాల నారాయణ అనే వ్యక్తి పేరు మీద పుత్తూరు నందు షాపు మంజూరైనది. గౌడ సంఘం సభ్యులు అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నాముఅధికారుల సూచన మేరకు షాపును మార్చాలని కోరగా మొదట తొర్రూరు బైపాస్ రోడ్డు నందు, అక్కడి నుండి విష్ణు మహల్, ఇస్లాపురం తరువాత కళ్యాణపురం దగ్గరికి మార్చాము. బెల్ట్ షాపు నిర్వాహకులు పగలు రేయి మద్యం అమ్మడంతో మా షాపు తెరిస్తే వాళ్లకు వ్యాపారాలు దెబ్బతింటాయని బయట ఊరి నుంచి జనాలను తెచ్చి ధర్నాలు చేపించడం జరుగుతున్నదిమా షాపు వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు మా పైకి బయట ఊర్ల నుంచి మనుషులను తెప్పించి దాడులకు పంపుతున్నారు.ఈ షాపు ద్వారా 28 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి,మేము షాపు తెరకపోతే చావేగతి, వేరే దారి లేదని వాపోయారు.షాపు తెరవకపోతే ప్రభుత్వానికి లైసెన్స్ కు మేము డబ్బులు ఎలా కట్టాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న మాకు న్యాయం జరగలేదని పత్రిక ముఖం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని మీ ముందుకు వచ్చామని పత్రికల వారిని కోరుకుంటున్నామని, మా బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా షాపును తెలుసుకునే దానికి అనుమతులు ఇచ్చి, మాకు రక్షణ కల్పించాలని, బెల్టు షాపుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, అత్తిరాల శ్రీరాములు గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాంబాబు గౌడ్, పురుషోత్తం గౌడ్, రామయ్య గౌడ్, ఉదయగిరి మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
