అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి
తహసిల్దార్ శ్రీనివాస్.
నిజాంపేట: నేటి ధాత్రి
అకాల వర్షాలు ఏ సమయంలో సమీపిస్తున్నయో! అర్థం కావడం లేదని రైతులు అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ శ్రీనివాస్ అన్నారు. నిజాంపేట మండలంలో మాట్లాడుతూ..
రైతులు ఆరుకాలం కష్టించి పండించిన పంట కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారాని కాబట్టి అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవాలన్నారు. రైతులు టార్పోలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించారు
