Illegal Sale of Assigned Land in Kaveli
అసైండ్ భూమి కబ్జా అవుతున్న డోంట్ కేర్ అంటున్న తహసీల్దార్ సిబ్బంది…..
◆- కవేలిలోని 321సర్వేనంబర్ భూమి ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు
◆- ఎతెచ్చగా అమ్ముకుంటున్నా ప్రభుత్వ భూమి
◆- ఎకరాకు 10లక్షలు పలుకుతున్న అసైండ్ భూమి
◆- తహసీల్దార్ సిబ్బందికి కాసుల రాలుతున్నాయని మౌనం
◆- కవేలి అసైండ్ భూములు గోనుగోలు చేసి షెడ్లు ఏర్పాటు
◆- అసైండ్ భూమి అమ్మినవారిని ప్రశ్నిస్తే కౌలుకు ఇచ్చామని ప్రగల్బాలు
◆- తహసీల్దార్ సిబ్బంది హస్తం ఉందంటున్న మండల ప్రజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం బ్రతకడానికి ఇచ్చిన అసైండ్ భూమి క్రాయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి కాని కోహిర్ మండల తహసీల్దార్ సిబ్బంది మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం ప్రశ్నర్దాకంగా మారింది. మండలంలోని కవేలి గ్రామంలోని 321సర్వేనంబర్ ప్రభుత్వ భూమి గతంలో నిరుపేదలకు బ్రతకడానికి అసైండ్ మెంట్ చట్టం ప్రకారం కేటాయించింది కాని ఆ భూమిని 10లక్షలకు ఎకరం చొప్పున ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసి షెడ్లు, ఫార్మ్ హౌస్ లు ఏర్పాటు చేసుకుంటున్న స్థానిక తహసీల్దార్ సిబ్బంది అటువైపు చూసి చూడనట్లు వ్యవహారిస్తుంది. అసైండ్ మెంట్ భూమి అమ్మడం కొనడం నేరం అని ప్రభుత్వం ఆదేశించినప్పటికి అదేమీ పట్టనట్లు తహసీల్దార్ సిబ్బంది చోద్యం చూస్తుంది. ఇదంతా చూస్తుంటే తహసీల్దార్ సిబ్బందికి కమిషన్ ఏమైన ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసైండ్ మెంట్ భూమి కలిగిన వ్యక్తులను ప్రశ్నిస్తే మా భూములను కౌలుకు ఇచ్చామని చెప్తున్నారు. వాస్తవానికి అసైండ్ మెంట్ భూమి కౌలుకు ఇవ్వాలని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు నిరుపేదలు పంటలు పండించుకుని బ్రతకటానికి కేటాయిస్తుంది. కాని వారు సంబంధిత ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి ఎకరాకు 10లక్షలు తీసుకోవడం జరుగుతుంది. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ సిబ్బంది ఎందుకు కాపాడలేక పోతుంది అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఇదంతా చూస్తే తహసీల్దార్ సిబ్బందికి కూడ లంచాల రూపంలో కొంత నగదును కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులు చెల్లెస్తున్నారని అనుమానాలు లేకపోలేదు ఎందుకు అంటే సంబంధిత వ్యక్తులు ఎన్ని అర్జీలు ఇచ్చిన సమాధానం ఇవ్వకపోవడమే దీనికి కారణం ఇప్పటికైన స్థానిక తహసీల్దార్ సిబ్బంది చర్యలు చేపట్టకపోతే జిల్లా కలెక్టర్,రెవిన్యూ మంత్రికి, తప్పకుండ ఫిర్యాదు చేస్తామని స్థానికులు చెప్తున్నారు.
