“నేటిధాత్రి” ఎఫెక్ట్
తహసీల్దార్ అరెస్టు.జైలుకు తరలింపు.
హైదారాబాద్ ,నేటిధాత్రి
నేటిధాత్రి దినపత్రిక కథనంతో సూర్యాపేట జిల్లాలో తహసీల్దార్, ఆర్ఐ లు అరెస్టు అయ్యారు.ఈ నేపథ్యంలో వారిని నల్గొండ జైలుకు తరలించారు. జిల్లా రెవిన్యూ శాఖలో సంచలనం రేపిన పైల్స్ ట్యాంపరింగ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది.మోతే మండల రెవిన్యూ ఆఫీస్ లో పహాణిలను టాంపరింగ్ చేసిన కేసులో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సిరియస్ గా ఫోకస్ చేయడంతో.. గత కొంత కాలంగా లోతైన విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన తహశీల్దార్,ఇద్దరు ఆర్ఐ లు, కంప్యూటర్ ఆపరేటర్, మీ సేవా నిర్వాహకులతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వీరికి జిల్లా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో సస్పెండ్ అయిన తహసిల్దార్, సంఘమిత్ర ,మహిళా ఆర్ఐ నిర్మలాదేవిని నల్గొండ సబ్ జైలు తరలించారు. మీసేవ నిర్వాహకుడితో సహా మిగతా ఐదుగురిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో వీరితోపాటు మరో 21 మందిని గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు గా సమాచారం.