వైస్సార్ సేవలు చిరస్మరణీయం .

వైస్సార్ సేవలు చిరస్మరణీయం
మెట్ పల్లి నేటి ధాత్రి

వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణను భారత దేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దిన మహా నాయకుడు ఎండాకాలం పంటలు నీళ్లు లేక సరిగా పండుతాలేవని ఆలోచించి వరద కాలువ అనే ఒక బ్రహ్మాండమైన కాలువను తవ్వించిన మహా నాయకుడు అందుకే ప్రతి ఇంట్లో వైయస్సార్ ఫోటో ఉంది అంటే అది ఆయన చేసినటువంటి గొప్ప పనుల వల్లే అని తెలిపారు ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి వందేమారుతి బాపూజీ కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అమ్ముల పవన్ యూత్ నాయకులు బైండ్ల శ్రీకాంత్ కోరే రాజు కుమార్ కోట మహేష్ నవీన్ గోవి శీను రాకేష్ తదిరితేలు పాల్గొన్నారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల.!

 

ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాడు స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి

 

కొత్తగూడ, నేటిధాత్రి:

నేటికీ వారి సంక్షేమ పథకాలే ఆదర్శం
మహనీయుని జయంతి సందర్భంగా.. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన మంత్రి సీతక్క…
కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద..
స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా… వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క..
వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజలను ఏకం చేసి ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సింహభాగం వహించిన వైయస్సార్
ఆనాడు పెట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకు నిస్వార్ధంగా అందినాయి…

 

 

 

మహాత్మా గాంధీ ఉపాధి హామీ, అభయ హస్తం, ఇందిరమ్మ ఇల్లు, రైతులకు ఉచిత విద్యుత్తు, 108 అంబులెన్స్, ఉచిత విద్య, పీజు అంబెర్స్, ఆరోగ్యశ్రీ…. వృద్ధాప్య పింఛన్లు అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ రింగ్ రోడ్డు, జాతీయ ప్రధాన రహదారులు, ఆలయ అభివృద్ధి పనులు, గ్రామ గ్రామాన ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ పాఠశాలలు జలయజ్ఞం మంచినీటి సౌకర్యం, ప్రాజెక్టు చెరువుల అభివృద్ధి పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చెందుతుంది నేటికీ వారి సంక్షేమ పథకాలే ఆదర్శం …
నేడు వారి జయంతి సందర్భంగా.. కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించినారు మంత్రి సీతక్క అన్నారు..

 

 

ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి,
సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ అద్యక్షులు.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు.
బానోత్ విజయ రూప్సింగ్ మాజీ ఎంపీపీ & జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి.
పులుసం పుష్పలత శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి.
బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి .
కాడబోయిన జంపయ్య మాజీ వైస్ ఎంపీపీ.యూత్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్,

 

 

 

వజ్జ వెంకటలక్ష్మి సురేందర్ మాజీ సర్పంచ్.
బొల్లు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
గుమ్మడి సమ్మయ్య కొత్తగూడ టౌన్ అధ్యక్షులు, వెలుదండి వేణు మండల నాయకులు.
హలవత్ సాలూకి సురేష్ మాజీ ఎంపిటిసి కొత్తగూడ.
మహమ్మద్ యాకుబ్ పాషా టౌన్ ప్రధాన కార్యదర్శి.
బుర్కా పుష్పలత నరేందర్ మాజీ ఎంపిటిసి కొత్తగూడ.
నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు,
వల్లపు రంజిత్ జిల్లా ఓబీసీ నాయకులు.సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్
రాజం సాంబయ్య.
బాలరాజు, కత్తుల వెంకన్న.
గొందిరాజు, ముడిగ సంతోష్. దేశీయ, భీరెళ్ళి సతీష్ , కే బిక్షపతి ,మహేందర్, వెంకన్న , దేవర శ్యాంసుందర్,
సంఘీ సంపత్, తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు .

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

నేటి ధాత్రి చర్ల

చర్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ నాయకులు చీమలమరి మురళి మాట్లాడుతూ
రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు బిడ్డగా అన్నదాతల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అని అన్నారు
సంక్షేమానికి బ్రాండ్
అభివృద్ధికి ట్రేడ్ మార్క్‌లా నిలిచి ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా పాల‌న చేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్
వైయస్‌ఆర్‌ 76వ జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గుండేపూడి భాస్కరరావు ఆవుల పుల్లారావు నల్లపు శేషగిరి విజయ్ కుమార్ నాయుడు మేడబత్తిన వాసు సిరిపురపు శివ పూజారి రమణయ్య కారంపూడి సల్మాన్ చీమకుర్తి సాయిచరణ్ పొగాకు సత్తి బాబు మునిగల వెంకన్న మాణికరావు రాజన్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మచ్చ రాజ కనితి శ్రీను మామిడి భాను తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version