డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ
నేటి ధాత్రి చర్ల
చర్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ నాయకులు చీమలమరి మురళి మాట్లాడుతూ
రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు బిడ్డగా అన్నదాతల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అని అన్నారు
సంక్షేమానికి బ్రాండ్
అభివృద్ధికి ట్రేడ్ మార్క్‌లా నిలిచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేసిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్
వైయస్‌ఆర్ 76వ జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గుండేపూడి భాస్కరరావు ఆవుల పుల్లారావు నల్లపు శేషగిరి విజయ్ కుమార్ నాయుడు మేడబత్తిన వాసు సిరిపురపు శివ పూజారి రమణయ్య కారంపూడి సల్మాన్ చీమకుర్తి సాయిచరణ్ పొగాకు సత్తి బాబు మునిగల వెంకన్న మాణికరావు రాజన్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మచ్చ రాజ కనితి శ్రీను మామిడి భాను తదితరులు పాల్గొన్నారు