మహిళలని కళాకారులుగా తీర్చి దిద్దడం హర్షనీయం..
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం పట్టణంలో మహిళలకు గత 37 సంవత్సరాలుగా ముగ్గుల పోటీ నిర్వహిస్తూ మహిళ లను కళాకారులు గా తీర్చిదిద్దడం హర్షనీయమ ని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నటరాజ్ కళానికేతన్ కేసముద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ బహుమతి ప్రధానో త్సవము కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవితంలో ఎన్ని వడు దోడుకులు ఎదురైనప్పటికీ నీతి నిజా యితీలను వదిలిపెట్టకుం డా జీవిస్తున్నానన్నారు. మీరు కూడా అలాగే సమస్యలకు భయపడకుం డా కష్టాన్ని నమ్ముకుని జీవించాలని అన్నారు. కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వరరావు మాట్లాడు తూ మహిళలలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ముగ్గుల పోటీలు దోహదపడతా యని అన్నారు. మహబూబాబాద్ జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ మనం మార్కెట్లో వస్తువు కొనేటప్పుడు మోసపో కూడదన్నారు. ప్రతి డబ్బాపై ఉండే ఎమ్మార్పీ తదితర అంశాలు పరిశీలించాలన్నారు.
అనంతరం ముఖ్య అతిధులు గుమ్మడి నరసయ్య,డాక్టర్ అల్లం రమ నాగేశ్వరరావు, మైస శ్రీనివాసులు చేతుల మీదుగా ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో నటరాజ కళానికేతన్ అధ్యక్షులు చీకటి వెంకట్రాo నరసయ్య, ఉపాధ్యక్షులు నాగనబోయిన వెంకటేశ్వర్లు,కోశాధికారి కుర్న హరినాథ్,వేల్పుల రేవంత్, రేణిగుంట సుధాకర్, శీలం సత్యనారా యణ,జక్కుల కృష్ణమూర్తి, గొల్లపల్లి రాజేష్, మహమ్మద్ రఫీ, కందుకూరి రవీంద్ర చారి తదితరులు పాల్గొనగా సమన్వయకర్తగా నల్ల కిరణ్ కుమార్ వ్యవహ రించారు.
ముగ్గుల పోటీ బహుమతి విజేతలు వీరే…
పెద్ద బజార్: ప్రధమ బహుమతి నాగనబోయిన సృష్టి యాదవ్, ద్వితీయ బహుమతి కస్తూరి శివాని, తృతీయ బహుమతి భూక్య అనూష.
మార్కెట్ బజార్: ప్రధమ బహుమతి శివరాత్రి శ్రీలక్ష్మి, ద్వితీయ బహుమతి రామగిరి భాగ్యలక్ష్మి, తృతీయ బహుమతి అర్వపల్లి జయశ్రీ.
కిష్టాపురం: ప్రధమ బహుమతి మామిడి శెట్టి సౌజన్య, ద్వితీయ బహుమతి వేల్పుల తేజశ్రీ, తృతీయ బహుమతి ఆగే రమ్య.లక్ష్మీ నగర్: ప్రథమ బహుమతి పిడుగు అఖిల, ద్వితీయ బహుమతి సింగంశెట్టి ప్రియాంక, తృతీయ బహుమతి రేణిగుంట్ల హరిణి గెలుపొందగా అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
