ఆశీర్వదించండి సేవకుడిగా పనిచేస్తా
14వ వార్డ్ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి భూస శిరీషరాజు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ అభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి భూస శిరీష-రాజు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చే నాయకులను నమ్మవద్దని కోరారు. అలాగే ,ప్రజా సమస్యలు తీర్చేవారికి అండగా ఉండాలని వేడుకున్నారు.తనకు డబ్బుల మీద ఆసక్తి లేదని, ప్రజలకు సేవ చేయాలనేదే తన అభిమతమన్నారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవకుడిగా పని చేస్తానని ఈ సందర్భంగా వార్డు ప్రజలను కోరారు.
