ఆధ్వర్యంలో విశ్వగురువు బసవేశ్వరుల వారి విగ్రహావిష్కరణ మహోత్సవము.

లింగాయత్ సమాజ్, జహీరాబాద్ ఆధ్వర్యంలో విశ్వగురువు బసవేశ్వరుల వారి విగ్రహావిష్కరణ మహోత్సవము

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఆత్మీయ శరణ బంధువులకు శరణు శరణార్థి,
12వ శతాబ్దము నందు సమాజములో పాగావేసిన జాతి, వర్ణ, వర్గ మరియు లింగ వివక్షతలను రూపుమాపుటకై భక్తి ఉద్యమానికి నాంది పలికిన యుగపురుషుడు విశ్వగురు బసవేశ్వరుడు..సకల జీవాత్ముల సంక్షేమము కొరకు నిరంతరము పాటుపడిన మహామానవతావాది, అభ్యుదయ వాది మనందరికి ఆదర్శప్రాయుడు. అతడు బోధించిన తత్యాలు యావత్ మానవాళికి అనుసరణీయమైనవి. అందుకే బసవేశ్వరుల వారిని విశ్వగురువుగా, ప్రపంచమునందె మొట్టమొదటి పార్లమెంట్ వ్యవస్థాపకుడిగా మరియు సమసమాజ నిర్మాతగా విశ్వమంతటా కీర్తించబడుచున్నాడు. ముక్తిదాయకుడు, శరణరక్షకుడు, విశ్వగురువు బసవేశ్వరుల వారిని నిత్యం దర్శించి, స్పూర్తిని పొందాలనే సదుద్ధ్యేశంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సమస్త బసవ భక్తుల ఆర్ధిక సహాయంతో జహీరాబాద్ లింగాయత్ సమాజ్ వారిచే హుగ్గెల్లి కూడలి (చౌరస్తా) వద్ద జాతీయ రహదారిపై “విశ్వగురు బసవేశ్వరుల వారి కాంస్య విగ్రహము” ప్రతిష్టింపబడినది.పరమ పూజ్యశ్రీ భాల్కి పట్టాధ్యక్షులు, మఠాధీశులు, రాష్ట్ర మంత్రి వర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రాజకీయ ప్రముఖులు, ఆర్థిక సహాయ మందించిన పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు యావత్ బసవ భక్తుల సమక్షములో తేదీ : 23-05-2025 శుక్రవారం మధ్యాహ్నం 12-00 గం॥లకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తమ అమృత హస్తాలతో “ఐశ్వగురు బసవేశ్వరుల వారి విగ్రహావిశ్కరణ” గావించెదరు.
కావున సమస్త శరణ బంధువులు, బసవతత్వాభిమానులు మా ఆహ్వానమును మన్నించి పై కార్యక్రమములో పాల్గొన వలసినదిగా ప్రార్ధన,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version