కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ (TVK Chief Vijay) నిన్న (శనివారం) కరూర్‌లో రోడ్‌షో (Karur Road Show) నిర్వహించారు. అయితే, ఈ రోడ్‌షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
క్షతగాత్రులకు తమిళనాడు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అంజేస్తున్నామని వివరించారు. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.