విజయ్ ర్యాలీ తొక్కిసలాటలో గుండెలు పిండేసే దృశ్యాలెన్నో..

విజయ్ ర్యాలీ తొక్కిసలాటలో గుండెలు పిండేసే దృశ్యాలెన్నో..

తమిళ హీరో విజయ్ నిన్న కరూర్ లో తీసిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎన్నో విషాద ఘటనలు. తమ బిడ్డల్ని చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రిలోకి బోరున ఏడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: తమిళ హీరో విజయ్ నిన్న తమిళనాడులోని కరూర్ పట్టణంలో తీసిన తన రాజకీయ పార్టీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39కి చేరింది. ఇందులో ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డలు విగత జీవులుగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

తొక్కిసలాట అనంతరం తమ బిడ్డల్ని హుటాహుటీన చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రిలోకి బోరున ఏడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల దగ్గర తీవ్ర వేదనతో కన్న బిడ్డల్ని చివరి ముద్దులు పెట్టుకుంటున్న సన్నివేశాలు ఆస్పత్రి వర్గాల్ని సైతం కన్నీరు కార్పిస్తున్నాయి.

 కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..

 కరూర్‌ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..

తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ నిన్న (శనివారం) కరూర్‌లో నిర్వహించారు. అయితే, ఈ రోడ్‌షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.

 తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ (TVK Chief Vijay) నిన్న (శనివారం) కరూర్‌లో రోడ్‌షో (Karur Road Show) నిర్వహించారు. అయితే, ఈ రోడ్‌షోలో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
క్షతగాత్రులకు తమిళనాడు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అంజేస్తున్నామని వివరించారు. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version