వడ్ల కొనుగోలు సెంటర్లలో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్.

వడ్ల కొనుగోలు సెంటర్లలో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలంలోని వడ్ల కొనుగోలు సెంటర్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముదిగుంట,శెట్టిపల్లి, కుందారం,వేలాల,కిష్టాపూర్, పౌనూర్ గ్రామాలలో ఏజెన్సీల ప్యాడి సెంటర్లు తనిఖీ చేయడం జరిగినది.వడ్ల సెంటర్లలో ఉన్న వరి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని తెలిపారు.అలాగే అకాల వర్షం ఉన్నందున వడ్లు తడవకుండా కాపాడుకోవాలని,హమాలీల కొరత ఉంటే బయట నుండి తీసుకొచ్చి మూడు షిఫ్టీలలో వర్క్ చేపించాలని అన్నారు.వడ్ల మైచర్ చూసి కాంట వేసి లారీలలో తరలించి మే 25వ తేదీ వరకు వడ్ల సెంటర్లో పూర్తి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,ఏపీఎం,సిసిలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version