ఉగాది వేడుకలను విజయవంతం చేయాలి…

ఉగాది వేడుకలను విజయవంతం చేయాలి

ఉగాది ఉత్సవ కమిటీ సభ్యులు

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 19న జరిగే వేడుకలను విజయవంతం చేయాలని ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు కొలుగూరి సంజీవరావు,ఎర్రం సతీష్ కుమార్, కాశెట్టి శ్రీనివాస్ లు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….
శ్రీ వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో
తెలుగుదనం ఉట్టిపడేలా ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఇల్లందు క్లబ్ లో జరిగే వేడుకలలో వేద పండితులచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వచ్చిన కళాకారులకు, కవులకు, రచయితలకు నృత్య కళాకారులకు శాలువా, మెమొంటో, ప్రశంస పత్రాలతో సత్కరించడం జరుగుతుందన్నారు.
భూపాలపల్లి మున్సిపల్ పాలకవర్గానికి సన్మానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు హాజరవుతున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని కవులు కళాకారులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు గుజ్జ సారేశ్వర్ రావు, ములకల లక్ష్మారెడ్డి,మంద జోవర్ధన్,ఆకుతోట ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.

సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనంలో..

సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనంలో భాగంగా యువ కవికి చిరు సత్కారం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ హనుమాన్ దేవస్థానంలో సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సమితి గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళీధర్, అధ్యక్షులు జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నేరోజు రమేష్ మరియు మానేరు స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు చింతోజు భాస్కర్ నాయకత్వం వహించారు.ఈ వేడుకకు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా, డి.ఎస్.పి కట్రోజు నాగేంద్ర చారి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిసమ్మేళనం నిర్వహించడంతో పాటు ప్రతిభ కనబరిచిన కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి నాగేంద్ర చారి మాట్లాడుతూ,
“కలం పట్టిన కవులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఒక సైనికుడిలా ఎదుర్కొంటూ, నిద్రలో ఉన్న సమాజాన్ని మేల్కొలిపే శక్తి కలవారు” అంతేకాకుండా ఇలాంటి యువకులు ముందుకు వచ్చి సమాజానికి సాహిత్యంతో రూపుమాపాలని అన్నారు.
అలాగే మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ,యువ కవి, రచయిత అంకారపు రవి
ని సత్కరించడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి యువ కవులను ప్రతిభలను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలు కవులు, రచయితలు పాల్గొని అభినందనలు తెలిపారు.

సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం…

సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనంలో భాగంగా గాంధీనగర్ హనుమాన్ దేవస్థానంలో సి.సా.స గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళీధర్, అధ్యక్షులు జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నేరోజు రమేష్, మరియు మానేరు స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు చింతోజు భాస్కర్ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగినది. ఇందులో భాగంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ అతిధులుగా చైర్మన్ కళా చక్రపాణి, విశిష్ట అతిథులుగా డి.ఎస్.పి కట్రోజు నాగేంద్ర చారి ఆధ్వర్యంలో కవిసమ్మేళనంతో పాటు కవులకు ఉగాది పురస్కారాలు అందించడం జరిగింది అంతోపాటు ఈ సందర్భంగా డి.ఎస్.పి నాగేంద్ర చారి మాట్లాడుతూ… కలం పట్టిన వీరులు కవులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఒక సైనికుడిలా ఎదిరించి నిద్రపోతున్న సమాజాన్ని లేపే వ్యక్తులే కవులని కళాకారులు రచయితలని అన్నారు.
అంతేకాకుండా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ సిరిసిల్ల సాహితీ సమితికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కవులకు ఆదరణగా ముందుకు సాగుతూ ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అంకారపు జ్ఞానోబా, గడ్డం పరశురాములు, గోష్కొండ మురారి, ముడారి సాయి మహేష్, ఆడేపు లక్ష్మణ్, అంజనా దేవి, యువ కవులు రచయితలు, అంకారపు రవి, దూడం గణేష్,గుండెల్లి వంశీ,ఈడేపు సౌమ్య, తదితర కవులు రచయితలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version