క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామంలో జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాణిక్ రావు, గ్రామ పెద్దల సహకారంతో సందర్భంగా నిర్వహించిన గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. శాసనసభ్యులు మాణిక్ రావు మాట్లాడారు. గ్రామ ప్రజలందరికీ వచ్చే మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయి ఇవి కండరాల బలం గుండె ఆరోగ్యం మెరుగైన రక్త ప్రసరణను అందిస్తూ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బృంద కృషితో కూడిన ఆటలు యువకుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ జట్టుగా పని చేసే నైపుణ్యాన్ని (Team Work) అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ మండల అధ్యక్షుడు వెంకటేశం మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ ప్రెసిడెంట్ ఎజస్ బాబా నాగన్న పటేల్ సర్జన్ నాగేశ్వర్ శీను పటేల్ సద్దాం సజావుద్దీన్ మరియు ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు మెంబర్ పాల్గొన్నారు.
