కొడవటంచ ఆలయ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం
కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకి స్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ ఆలయం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు
