తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లాకు చెందిన జుంజుపల్లి నర్సింగ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సంఘం విస్తరణ,బలోపేతం చేయడం కోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం అన్నారు.గతంలో విద్యార్థి, యువజన,ప్రజా పోరాటాల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర ను పోషించి,ఉమ్మడి రాష్ట్రానికి నాయకత్వం వహించిన నర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సమర్థవంతుడని కొనియాడారు.సంఘం బలోపేతం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలను ఐక్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా పనిచేయాలని కోరారు.దాని కొరకు సంఘంలో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నర్సింగ్ మాట్లాడుతూ.. నా పట్ల విశ్వాసంతో సంఘం బలోపేతం కోసం బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.
50 లక్షల 65 వేల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కనీస కేటాయింపులు లేకపోవడం అన్యాయమని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ రూపొందించకుండా దోపిడి వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సిగ్గుచేటని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను, తెలంగాణ పట్ల వివక్షపూరిత కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 8న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పోరేట్ శక్తుల కోసమే కేంద్ర బడ్జెట్ అన్నట్లుగా ప్రవేశపెట్టి రైతులను కూలీలను కార్మికులను మహిళలను సామాజిక తరగతులను విస్మరించారని కనీసం గతంలో కేటాయించిన విధంగానైనా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కోతలు విధించి ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా దోపిడి వర్గాల పాలకులుగా నిరూపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు నిధులు పెంచాల్సింది పోయి సబ్సిడీలు తగ్గించారని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి దొరకకుండా బడ్జెట్లో కోత విధించారని పంటల ధరల నియంత్రణకు బడ్జెట్ కేటాయింపులే లేవని ఈ బడ్జెట్ పేదలపై భారాలు- కార్పోరేట్ శక్తులకు వరాలు అన్న మాదిరిగా ఉన్నదని, ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన బడ్జెట్ కేటాయింపులు లేకుండా తీరని అన్యాయానికి వివక్షతకు గురి చేశారని రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఒరిగింది శూన్యమని గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా అమలు చేసే విధంగా బడ్జెట్ లేదని, ఇలాంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర అభివృద్ధికి వివిధ తరగతులు వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ప్రకారం నిధులు కేటాయించే విధంగా పోరాడాలని ఈ క్రమంలో ఈనెల 8న కమ్యూనిస్టు కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యతగా సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఇందు కోసం కృషి చేయాలని కోరారు. ఈ 2కే రన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి.ఎస్.జే.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షుడు కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఈద శ్రీనాథ్, నాగపురి నాగరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరుముల్ల ఎల్ల స్వామి
గణపురం నేటి ధాత్రి:-
గణపురం మండలం కేంద్రంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఆరుముల్ల ఎల్ల స్వామి వారి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తరువాత ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గ వర్గీకరణ చేయడం మాకెంతో సంతోషంతో ఉందని తెలంగాణ సీఎంకు మా జాతి రుణపడి ఉంటుందని వారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ వెంపటి భువన్ సుందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు పెండ్యాల వెంకటేష్ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి మొలుగూరి రాజు దూడపాక దుర్గయ్య మండల నాయకులు మామిండ్ల మల్లికార్జున్ మండల అధికార ప్రతినిధి మేడిపల్లి రాజు గౌడ్ బీసీ సెల్ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివ శంకర్ బోనాల రాజమౌళి దూడపాక పున్నం యూత్ టౌన్ అధ్యక్షులు మండల నాయకులు అందరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు
తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల స్వయంభుగా వెలసిన శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా కొనసాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయించి దేవాలయం లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, కాకి రాజయ్య, ఎల్లగౌడ్ లు ఉన్నారు.
`ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడుపుతున్న రేవంత్
`రేవంత్ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం
`తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టను పెంచిన రేవంత్
అధిష్టానానికి అప్తుడు
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని రావడం గొప్పవిశేషమనే చెప్పాలి. గత ఏడాది రూ.40,232కోట్లు వచ్చాయి. దీంతో పోలిస్తే ఏకంగా నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు సాధించడం రేవంత్‌రెడ్డి సాధించిన గొప్ప విజయంగా నిలిచి పోయింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 49550 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈసారి ప్రభుత్వం 20 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 23వ తేదీ ఒక్కరోజే ప్రపంచం లోని ఐదు దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో 91,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం నిజంగా ఒక రికార్డు అనే చెప్పాలి. ఇక ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు తమ ప్రాంగణాలను హైదరాబాద్‌లో విస్తరించనున్నట్టు ప్రకటించాయి. రామ్‌కీ గ్రూపు రాష్ట్రంలో సమీకృత పారిశ్రామిక పార్క్‌లు, డ్రైపోర్టులు, టౌన్‌షిప్‌లపై పెట్టుబడులు పెట్టడానికి సానుకూలంగా వుండటం మరో సానుకూలాంశం. పెట్టుబడుల్లో ప్రధానమైనవి ఈ పెట్టుబడుల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గవి అమెజాన్ రూ.60వేల కోట్లు, సన్ పెట్రో కెమికల్స్ రూ.45వేల కోట్లు, టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15వేల కోట్లు. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ విస్తరణ ద్వారా 17వేలు, హెచ్‌సీఎల్ విస్తరణతో 5వేలు, విప్రో విస్తరణతో 5వేలు కొత్తగా ఉద్యో గాలు లభించనున్నాయి. అమెజాన్, టిల్మన్, సిఆర్‌ఎల్‌ఎస్ సంస్థలు తమ డేటా సెంటర్ల విస్తరణ ద్వారా తెలంగాణకు గొప్ప ప్రయోజనం చేకూరనుంది. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, యుద్ధ విమానాల ఇంటీరియర్ డిజైన్, యు.ఎ.వి. తయారీ మరియు రక్షణరంగంలో జిందాల్ పెట్టుబడులు రానున్నాయి. కొత్త రంగాలపై దృష్టి ప్రస్తుతం తెలంగాణ ఐ.టి, ఫార్మా రంగాలకు హబ్‌గా వెలుగొందుతోంది. ఇప్పుడు డేటాసెంటర్లుగ్రీన్ ఎనర్జీ, ఆహారశుద్ధి, విద్యుత్ వాహనాలు, సెమికండక్టర్స్ వంటి రంగాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. కోవిడ్ మహమ్మారి తర్వాత సరఫరా శృంఖలాలు దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు అదనంగా సరఫరా శృంఖలాలను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ తీవ్రంగా కృషిచేస్తోంది. అంతేకాదు ఒక ట్రిలియన్ ఎకానమీని సాధించేదిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ మరియు రీజినల్ రింగ్ రోడ్డు మధ్యప్రాంతాలను సెమీ అర్బన్ జోన్‌గా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని, ఔటర్ రింగ్‌రోడ్డు దిగువ భాగంలో సేవారంగానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇక రీజినల్ రింగ్ రోడ్డుకు ఆవలి ప్రాంతాల్లో వ్యవసాయం మరియు ఆహారశుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మౌలిక సదుపాయాలు, సమీకరణ, అవకాశాలు, సుస్థిరత అనేవి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన లక్ష్యాలు. మెట్రోరైల్ విస్తరణ, రీజినల్ రింగ్ రైల్వే, రేడియల్ రోడ్లు, కొత్త విమానాశ్రయాలు, మూసీనది పునరుద్ధరణ, విద్యుత్ వాహనాలకు ప్రో త్సాహం, స్కిల్ యూనివర్సిటీ వంటివి ప్రభుత్వ ప్రాధాన్యతలుగా వున్నాయి. ఎదురులేని నేత అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో పార్టీలో, రాష్ట్రంలో తనకు ఎదురులేదని నిరూపించుకోవ డంలో విజయం సాధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి తగినన్ని స్థానాలు సంపాదించి పెట్టడంలో కృతకృత్యులయ్యారు. పార్టీలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా విపక్ష పార్టీలపై ఒంటరిగానే ఎంతో నైపుణ్యంతో ఎదురుదాడులకు దిగుతూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల తర్వాత ఇక రేవంత్ హైదరాబాద్ విస్తరణపై దృష్టి సారించి ఫోర్త్ సిటీని ఏర్పాటును ప్రకటించారు. నగరంలో ఆక్రమణలను తొలగించడం, పర్యావరణ పరిరక్షణకోసం ఏర్పాటు చేసిన హైడ్రా కార్యకలాపాలతో వచ్చిన కొన్ని వివాదాలు ఇబ్బంది పెట్టినా వెనుకడుగు వేయలేదు. ఈ ఏడాది పైచిలుకు కాలంలో రెండుసార్లు దావోస్ సమావేశాలకు హాజరు, అమెరికా మరియు దక్షిణ కొరియాల్లో జరిపిన పర్యటనలను అ త్యంత విజయవంతమైన విదేశీ పర్యటనలుగా చెప్పాలి. గత ఏడాది దావోస్, అమెరికా, దక్షిణ కొరియాల్లో జరిపిన పర్యటనల ద్వారా రాష్ట్రానికి రూ.80వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలి గారు. ఈసారి దావోస్ పర్యటనలో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను సాధించారు. ఇవన్నీ ఆయన పనితీరుకు, పాలనా సాఫల్యతకు ప్రత్యక్ష నిదర్శనాలు. కేంద్రంతో సమతుల్యంగా… రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. యువతలో విద్య తో పాటు నైపుణ్యాలను కూడా పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. కేంద్రంతో సత్సంబంధాల విష యంలో గత కె.సి.ఆర్. ప్రభుత్వం కంటే రేవంత్ ఎంతో నైపుణ్యంతో, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా రు. కేంద్రం సహాయం లేకుండా ప్రభుత్వ మనుగడ కష్టమన్న సంగతి రేవంత్‌కు బాగా తెలుసు. కేంద్రంలో భాజపా సర్కార్ పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకి. మరి తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరపడమంటే కత్తిమీద సామే. ఈ విషయంలో ఆయన తె లంగాణ అభివృద్ధి, ప్రయోజనాల విషయంలోకి రాజకీయాల ప్రసక్తి లేకుండా ఆచితూచి వ్యవహ రిస్తున్నారు. రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న రీతిలో ఆయన వ్యవహారశైలి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆయన కాళేశ్వరం, గత ప్రభుత్వం ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంతో జరిపిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, ఫార్ములా ఈ`రేస్‌లో జరిగిన అవకతవకల విషయంలో విచారణలు, విచారణ కమిషన్లు వేయడం వంటివి బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికే. సంధ్య ధియేటర్ తొక్కిసలాటపై అసెంబ్లీలో రేవంత్ చేసిన భావోద్వేగ ప్రసం గం అందరినీ కదిలించి వేసింది. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కోర్టుకూడా రేవంత్ వైఖరికే మద్దతు పలికింది. రేవంత్ అనుసరించిన స్పష్టమైన వైఖరి, టాలీవుడ్‌ను కాళ్లబేరానికి తీసుకొచ్చింది. రేవంత్ ప్రాధాన్యతలు ప్రస్తుతం ఆయన ప్రధాన ప్రాధాన్యతలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసు కెళ్లడం. హెల్త్‌కేర్ కేపిటల్‌గా, వంటకాలకు కేంద్రంగా, క్రీడారంగంలో తలమానికంగా, పెట్టుబడిదార్లకు స్వర్గధామంగా మలచడం ఆయన ప్రధాన లక్ష్యాలు. పెట్టుబడిదార్లను ఆకర్షించడంలోభాగమే, హైడ్రా ఏర్పాటు, మూసీనది పునరుద్ధరణ కార్యక్రమాలు. మొత్తంమీద చెప్పాలంటే రేవంత్ ఏడాది పైచిలుకు పాలన సమర్థవంతంగా సాగిందనే చెప్పాలి. ఆయన కాకుండా మరే ఇతర కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఈస్థాయి సుస్థిరత సాధించడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు అటువంటివి. అన్నింటా తానై, ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగుతుండబట్టే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత బాగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం రేవంత్ పరిపాలనా దక్షతేనన్నది మాత్రం ముమ్మాటికీ నిజం!
రేవంత్ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన ముగించుకొని రెండో ఏడాదిలోకి ప్రవేశిం చింది. అయితే ఈ ఏడాది స్థానిక ఎన్నిక సంస్థల గడువు ముగిసిపోనుండటంతో వాటికి ఎన్నికలు జరపాలి. రేవంత్ సర్కార్ ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నిర్వహించాలి. మున్సిపాలిటీల పాలక వర్గాల కాలపరమితి జనవరి 26తో, గ్రామ పంచాయతీల కాలపరమితి ఫిబ్రవరితో, జిల్లా మరియు మండల పరిషత్‌ల కాలపరమితి వచ్చే జులైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఎన్నికలు నిర్వహించి, తన బలానికి తిరుగులేదని మరోసారి నిరూపించుకోవడానికి సంసిద్ధమవుతోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మండల ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఈనెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకురానుంది. సంక్రాంతి తర్వాత మార్చి నెలాఖరులోగాదశల వారీగా ఈ ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. మార్చి నెలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగనున్న తరుణంలో వాటితో పాటే ఈ ఎన్నికలను కూడా ముగించేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశంపై చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ తన ఏడాది పాలన ముగిసిన సందర్భంగా ఉత్సవాలు చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రేవంత్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని చెప్పక తప్పదు. రాష్ట్రంలో మొత్తం 12769 గ్రామ పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు వున్నాయి. 2021లో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జోనల్ వ్యవస్థ కింద ప్రస్తుతం ఏడు జోన్లున్నాయి. అవి వరుసగా బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న, చార్మినార్, జోగులాంబ మరియు యాదగిరి. 5857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రు లకు ఇతర నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పాలనలో కూడా పార్టీ ని అంటిపెట్టుకొని నిబద్ధంగా పనిచేసిన కార్యకర్తలకు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ఆయన స్పష్టంగా నిర్దేశించినట్టు తెలుస్తోంది. అవకాశవాద రాజకీయాలు నెర పుతూ, అవసరాన్ని బట్టి పార్టీలు మారేవారిని పట్టించుకోవద్దని ఆయన స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. అదీకాకుండా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుముందు అంపశయ్య పై ఉన్న పార్టీని ఏకంగా అధికారంలోకి తెచ్చిన రేవంత్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా తా నేంటనేది మరోసారి నిరూపించుకోబోతున్నారు. స్థానిక ఎన్నికలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతా ల్లో జరుగనున్నందున రైతు, మహిళ, బీసీ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి, తమది సంక్షేమ ప్రభుత్వమని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన కృతనిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీకి ఏమాత్రం నష్టం జరిగినా, అది రేవంత్ నాయకత్వానికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న సీనియర్ నాయకులు ఒక్కసారి జూలు విదిల్చి రేవంత్‌ను చికాకుపెట్టడానికే యత్నిస్తారు. తన మార్కు రాజకీయాలు నెరపుతున్న రేవంత్‌కు యివేవీ తెలియంది కాదు. 2019 స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, ఈ సారి రాజకీయాల్లో పూర్తి మార్పు కనిపిస్తోంది. గత అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లాస్థాయి నాయకులు, చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. రైతుబంధు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంపు, దీనికి తోడు భూమిలేని, కౌలు రైతులకు రైతు భరోసా కింద వార్షి కంగా రూ.12వేలు చెల్లింపు, రైతులకు సన్నవరి ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిం పు, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల వైతరిణి నుంచి గట్టెక్కిస్తాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ ఫిరాయింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ కచ్చితంగా ఈ ఎన్నికలపై చావో రేవో అన్న రీతిలో దృష్టిపెట్టక మానదు. ఇదే సమ యంలో కాషాయపార్టీ కూడా స్థానికంగా మరింత బలపడేందుకు అవసరమైన వ్యూహాలు రచి స్తోంది. కాంగ్రెస్ ఇంకా రైతు భరోసా చెల్లించలేదు. దీనికోసం కసరత్తు జరుగుతున్నదని వార్త లు వస్తున్నాయి. ఇదిలావుండగా జనవరి 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎంతమేర రిజర్వేషన్లు కల్పించాలన్నది, ఎస్సీ ఉప`కుల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదించిన అం శాలు, రైతుబంధు స్థానంలో రైతుభరోసాను ప్రవేశపెట్టడం, యాదగిరిగుట్ట దేవస్థానానికి, టీటీడీస్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. బీసీ కమ్యూనిటీల పై సర్వే నిర్వహించేందుకు గత నవంబర్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ కమిషన్‌ను నియమించింది. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ బి. వెంకటేశ్వరరావు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ నివేదిక ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందే అవకాశముంది. అదేవిధంగా సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు ఎస్సీ ఉప`కుల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఒక కమిషన్‌ను అక్టోబర్ 11న ప్రభుత్వం నియమిం చింది. ముందుగా ఈ కమిషన్ కాలావధిని రెండు నెలలుగా నిర్దేశించినప్పటికీ, తర్వాత వివిధకారణాలవల్ల మరో నెలపాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ కమిషన్ తుది నివేదిక కూడా ఈవారం చివర్లో అందే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్ నివేదిక అందాల్సిన నేపథ్యంలో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర నియామక సంస్థల నియామ కాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఎస్సీ ఉప`కుల వర్గీకరణ కమిషన్ నివేదిక ఆధారంగా రిజ ర్వేషన్లను అమలు పరచాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో రిజర్వేషన్ల అమలుపై కూడా ఈసమావేశంలో సమీక్షించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో విధానపరంగా కీలకమైన మార్పు విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు స్థానంలో రైతు భరోసాను తీసుకు రావాన్నది రేవంత్ ప్రభుత్వ ఉద్దేశం. అంటే రైతుబంధు కింద ఇప్పటివరకు రైతులకు వార్షికంగా రూ.10వేలు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్నది. అయితే దీన్ని రూ.15వేలకు పెంచి రైతుభరోసాగా పేరుమార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇదే సమయంలో పెట్టుబడి సా యం అందించే విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశముంది. ముఖ్యంగా సహా యం అందించడానికి సాగుభూమి పరిమితిని విధించడం, వ్యవసాయేతర భూములను ఈ పథ కం నుంచి మినహాయించడం, వ్యవసాయ భూమి పరిమితిని 5`10ఎకరాలుగా నిర్ణయించడం వంటి అంశాలు ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా రైతు బంధు నుంచి మినహాయించిన వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను రైతు భరోసా కిందికి తీసుకొచ్చి వార్షికంగా రూ.12వేలు చెల్లించే అంశాన్ని కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నా రు. యాదరిగిరి గుట్ట దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో పాలక మండలిని ఏర్పాటుచేయాలన్నది కూడా ప్రభుత్వ ఉద్దేశం. ఇదికూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఇదిలావుం డగా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇవ్వాన్నది ప్రభుత్వ ఉద్దేశం. రేషన్‌కార్డు ఇచ్చేం దుకు ప్రస్తుతం వున్న వార్షికాదాయ పరిమితిని పెంచే అవకాశముంది. ఏది ఏమైనా ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నదున, ఇది కూడా ఎన్నికల నామ సంవత్సరంగా మారిం ది. అందువల్ల ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాలు హాట్‌గానే వుండబోతున్నాయనేది స్పష్టమవుతోంది.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,
vaddiraju ravichandra
రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రి భాయిపూలేకు ఘనంగా నివాళులర్పించారు.సావిత్రి భాయి 194వ జయంతి సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి స్త్రీవిద్యా వ్యాప్తికి చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్,కోతి కిశోర్ గౌడ్,తుంగబాలు,గాంధీ నాయక్ తదితరులు పాల్గొని సావిత్రి భాయి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.
2022లోనే రూ.8973 కోట్లతో నదీ ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం
హైదరాబాద్,నేటిధాత్రి: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూసీనది ప్రక్షాళనకోసం అక్రమ కట్టడాల కూల్చివేతలు మరి యు జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకోసం ఏర్పాటైన హైడ్రా సంస్థ అక్రమ కట్టడాల పై ఉక్కుపాదం మోపుతుండటం మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడమే కాదు, సర్వత్రా ప్రధాన చర్చనీయాం శంగా మారడం వర్తమాన చరిత్ర. హైడ్రా పరిధి రాజధాని చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)లోపల ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ మాత్రమే. ఇక మూసీ పరీవాహక ప్రాంతంలో చేపడుతున్న కూల్చివేతలకు హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది లావుండగా దుర్గం చెరువుతో సహా పదకొండు చెరువులను పునరుద్ధరించి పరిరక్షించాలని హైకోర్టులో 2007లో ఒక పిల్ దాఖలైన నేపథ్యంలో దీనిపై కోర్టు ఒక అడ్వకేట్ కమిషన్‌ను నియ మించింది. ఈ చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికార్లు ఆయా చెరువుల పరిధిలో నివసిస్తున్న వేలాదిమందికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఈ 11 చెరువుల అంశం కోర్టు పరిధిలో వుంది. ఆందోళనలు అనవసరం తాము ఎంతో కష్టపడి నెలసరి వాయిదాలపై లోన్లు తీసుకొని నిర్మించిన ఇళ్లపైకి ఎప్పుడు బు ల్డోజర్ వస్తుందోనని నగరవాసులు ముఖ్యంగా మధ్య, పేదతరగతి వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు చెరువులు, కుంటల్లో పట్టా భూములు వుంటే అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని చట్టాలు స్పష్టంగా చెబుతుంటే, రెవెన్యూ, మునిసిపల్ అధికార్లు ఎడాపెడా అనుమతులిచ్చారని, వారిపై చర్యలు తీసుకోకుండా కష్టపడి నిర్మించుకున్న తమ ఇళ్లపైకి బుల్డోజర్లు పంపడం ఎంతవరకు న్యాయమనేది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆవేదన. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సరైన అవగాహనతో కూడిన ప్రచా రం లేకపోవడం ప్రజల్లో భయాందోళనలకు ప్రధాన కారణమన్నది మరువరాదు. అక్రమ నిర్మాణమైనప్పటికీ అందులో ప్రజలు నివసిస్తుంటే దాని జోలికి వెళ్ల బోమని హైడ్రా కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో అన్ని అనుమతులు వున్న కమర్షియల్ నిర్మాణాలను కూడా కూ ల్చబోమని కూడా ఆయన చెబుతున్నారు. నీటివనరులను పరిరక్షించే చర్యల్లో భాగంగా కొత్తగా నిర్మించే అక్రమ నిర్మాణాలు లేదా అనుమతులు రద్దు చేసిన వాటిని మాత్రమే కూల్చివేస్తామని ఆయన కుండబద్దలు కొడుతున్నట్టు చెబుతున్నా, ఇవి సరిగ్గా ప్రజల్లోకి వెళ్లడంలేదు. కూల్చివేతల హోరులో ప్రజల్లో అనవసర భయాలు సృష్టించే ప్రచారాలు ఎక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు ఎఫ్‌టిఎ మరియు బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై కేసులు న మోదు చేస్తామని హైడ్రా కమిషనర్ చెబుతున్న మాటలు కూడా సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్లడంలేదు. అక్రమంగా అనుమతులిచ్చిన అధికార్లపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామంటున్నా అవి ‘బుల్డోజర్ల’ భయం హోరులో ఎవరి చెవికి ఎక్కడంలేదు. ప్రసార సాధనాల జోరు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అసలు వాస్తవాలు మరుగునపడి, అవాస్తవ ప్రచారాలు చిలవలు పలవలుగా ప్రజలకు చేరడం ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణం. పెద్దవాళ్లకు నోటీసు లు జారీచేస్తూ, పేదలకు నోటీసులు జారీచేయకుండానే ఇళ్లను కూలగొడుతున్నారని జరుగుతు న్న ప్రచారంలో కూడా పూర్తి వాస్తవం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జలవనరుల్లో నిర్మించిన నిర్మాణాల కూల్చివేతకు ఎటువంటి నోటీసులు జారీచేయాల్సిన అవసరం లేద న్న సత్యాన్ని హైడ్రా కమిషనర్ గుర్తుచేస్తున్నారు. ఈ రూలు అందరికీ సమానమే. ఈ గందరగోళంలో ఎవరూ పట్టించుకోని మరో ప్రధానాంశం, హైడ్రా పేదలు నివసించే ఇళ్లజోలికి పోవడంలేదన్న సత్యాన్ని గుర్తించకపోవడం. ఇటీవల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు, హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నించిన నేపథ్యంలో జులై 19న జీఓ ఎంఎస్ నెం.99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీజేసిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదముద్ర వేయ డం తాజా పరిణామం. వచ్చే శాసనసభ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎంతమాత్రం వెనుకడుగు వేయడానికి సిద్ధంగా లేరన్న సత్యం వెల్లడవుతోంది. విపక్ష రాజకీయం విపక్షాలు ప్రభుత్వంపై దాడిచేయడానికి ఎప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాయి. ఇప్పుడు వాటికి ఈ కూల్చివేతల రూపంలో దొరికిన ఈ చక్కటి అవకాశాన్ని ఎడాపెడా తమకు అనుకూలంగా మలచుకోవడానికి యత్నించడం తమ రాజకీయ క్రీడలో వాటికి సహజమనిపించవచ్చు. కాంగ్రెస్‌కు ఓటేయలేదన్న అక్కసుతోనే మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్లు కూల గొడుతున్నారని అవి ప్రచారానికి దిగడం ప్రజల్లో మరింత గందరగోళాన్ని సృష్టించడానికి తప్ప మరోటి కాదు. అసలు మూసీ నదికి హద్దులు నిర్ణయించి, నదికి 50 కిలోమీటర్ల దూరంలో బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది గత బి.ఆర్.ఎస్.ప్రభుత్వం మాత్రమే. 2021లో తీసుకున్న నిర్ణయం ప్రకారం మాస్టర్ ప్లాన్‌ను తయారుచేయాలని అప్పటి రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ల కు ఆదేశాలిచ్చింది కూడా కె.సి.ఆర్. ప్రభుత్వమే. మరిప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకంటూ ఎ దురుదాడికి దిగుతున్నది కూడా బీఆర్‌ఎస్ మాత్రమే. మూసీని కాలుష్య రహితం చేయాలని, ఈ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించింది కూడా కె.సి.ఆర్. అన్న సత్యా న్ని బి.ఆర్.ఎస్. నాయకులు మరచిపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ లబ్దికోసం చేస్తున్న ఆర్భాటం మాత్రమేననుకోవాలి. నిజానికి 2023లోనే నాటి బి.ఆర్.ఎస్. ప్రభుత్వం మూసీ నదిని, గోదావరి జలాల ద్వారా పరిశుభ్రం చేయాలని తలపోసింది. ఇందుకోసం మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకు అయ్యే ఖర్చు దాదాపు రూ.9వేల కోట్లుగా అంచనా చేసింది. మురికినీటిని శుభ్రం చేసే ప్లాంట్లు, వంతెనలు, చెక్‌డ్యాంల నిర్మాణం, జంటనగరాలకు 85 కి లోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను మూసీనదిలోకి తరలించడం ఈ ప్రాజెక్టులో భాగం. అయితే మూసీ నది పరిరక్షణ చర్యల్లో భాగంగా బి.ఆర్.ఎస్. ప్రభుత్వం చేపట్టాలనుకున్న చర్యలను కొందరు నిపుణులు అప్పట్లో విభేదించారు ‘ఇక్కడ కావలసింది మూసీనది ప్రాంత సుందరీకరణ కాదు, మురికిమయంగా మారిని నదీ జలాలను స్వచ్ఛంగా మార్చడం’ అని స్పష్టం చేశారు. కాలుష్య మయంగా ఉన్న మూసీ జలాల పరిశుభ్రంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని కూడా వారు ప్రభుత్వానికి సూచించారు. సుందరీకరణ వల్ల నదీ తీరం మరింత కుంచించుకుపోతుంది. ఒకపక్క నదిలోని నీరు దుర్గంధం వెదజల్లుతుంటే సుందరీకరణకు అర్థం లేదంటూ వారు వ్యక్తం చేసిన అభిప్రాయంలో వాస్తవం వుంది. దీనికితోడు మరింత తగ్గిపోయిన నదీ తీరం వల్ల నగరానికి వరద ముప్పు మరింత పెరుగుతుంది. ఆక్రమణల రాజకీయాలు కృష్ణానదికి ఉపనదిగా ఉన్న మూసీ తెలంగాణలోని అనంతగిరి కొండల్లో పుట్టి నల్గండ జిల్లా లో కృష్ణానదిలో కలుస్తుంది. గత 30ఏళ్లుగా వేగంగా జరిగిన పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి ప్రభావాన్ని మూసీనది చవిచూసింది. ఫలితంగా ప్రస్తుతం ఇది ప్రమాదకరమైన రసాయనాలు, మురుగు నీరు విచ్చలవిడిగా కలుస్తున్న నేపథ్యంలో దుర్గంధాన్ని వెదజల్లుతూ రోగాలకు కారణమవుతోంది. ఆవిధంగా ఒకనాడు తెలంగాణ థేమ్స్ నదిగా పేరొందిన మూసి చివరకు ఇంతటి దుర్గతికి లోనైంది. ఇప్పటివరకు మూసీనది ప్రక్షాళన కోసం కోట్లాది నిధులు ఖర్చుచేసామని చెబుతున్నా ఒక్క చుక్క నీరు కూడా పరిశుభ్రం కాలేదు. ఈ నేపథ్యంలో కె.టి.ఆర్. గతంలోని మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని పక్కనబెట్టి కొత్త ప్రణాళిక చేపట్టాలని నిర్ణయించారు. అయితే గోదావరి జలాలలను మూసీనదికి తరలించడం వల్ల కొత్త సమస్యలు వరదల రూపంలో తలెత్తుతాయని పర్యావరణవేత్తలు మొత్తుకున్నారు. ముఖ్యంగా మూసీనది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది కాబట్టి గోదావరి జలాలను ఇందులోకి తరలిస్తే, నగరానికి వరదముప్పు ఏర్పడుతుందని కూడా హెచ్చ రించారు. అంతేకాదు ప్రాజెక్టు డాక్యుమెంట్‌ను బయటపెట్టి, బహిరంగ చర్చలకు అవకాశం క ల్పించాలని కూడా అప్పట్లో నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలావుండగా నది తీరప్రాంతం రియల్టర్లు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల ఆక్రమణలకు లోనుకావడంతో దీని పరిధి బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో ఆక్రమణలకు పాల్పడ్డవారు, తమ భూముల చుట్టూ నిరుపేదలు గుడిసెలు వేసుకోవడానికి ప్రోత్సహించారు. ఆవిధంగా వారు తమ అక్రమ నిర్మాణాలను రక్షించుకోవాలన్న దుస్సంకల్పం వారిది. వీరి నిర్మాణాలను కూల్చాలంటే, ముందుగా అధికార్లు నిరుపేదల గుడిసెలను కూల్చాలి. అప్పుడు నానా యాగీ చేయవచ్చు. ఇప్పుడు జ రుగుతున్నది సరిగ్గా ఇదే. ఈ కుచ్చిత రాజకీయాలకు రేవంత్ రెడ్డి లంగ బోడన్న సత్యాన్ని తా జా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రేవంత్‌ను బుజ్జగించిన అధిష్టానం మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాల కూల్చివేతలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌ను కోరినట్టు తెలుస్తోంది. అక్రమ కట్టడాల విషయంలో నిందితులు ఒకరైతే, బాధితులు నిమ్నకులాలవారే ఉంటారన్న సంగతిని ఆయనకు గుర్తు చేసినట్టు సమాచారం. అయితే డబుల్ బెడ్‌రూమ్‌లు, పునరావాస కార్యక్రమా ల ద్వారా నిరాశ్రయులను ఆదుకుంటామని రేవంత్ భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఏ బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతుందో, అదే సంస్కృతిని అమలు చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని కూడా హితవు చెప్పడమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా సామాన్యులపై కొరడా రaుళిపించవద్దని కూడా ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. విచిత్రమేమంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో బుల్డో జర్ ప్రయోగం వల్లనే అక్రమార్కులు, గూండాల అరాచకాలు తగ్గాయన్న సత్యాన్ని కాంగ్రెస్ ఇంకా గుర్తించకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి అరాచకాలు అరికట్టడం వల్ల ప్రగతిపథంలో దూసుకుపోతున్న సత్యాన్ని విస్మరించకూడదు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ వైఖరిని అక్కడి ప్రజలు తిరస్కరించారు కనుకనే కనుమరుగైపోయింది. అయినా దీన్ని ఆ పార్టీ అధినాయకత్వం గుర్తించకపోవడం విషాదం! చరిత్ర 1908లో మూసీనదికి వచ్చిన వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో నదికి వరదలను నివారించే ప్రక్రియలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ రిజర్వాయర్లను అప్పటి నిజాం ప్రభుత్వం నిర్మించింది. 1997లో మూసీ బచావో ఆందోళన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం మూసీనది ప్రాంతాన్ని సుందరీకరించే ప్రక్రియలో భాగంగా ‘నందనవనం’ ప్రాజెక్టు ను అమలు చేసింది. 2005లో మొట్టమొదటిసారి ప్రభుత్వం నదిలోకి కాలుష్యాలు చేరకుండా ఒక ప్రాజెక్టును చేపట్టింది. 2006లో మూసీ పరిరక్షణ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా 2009లో మూసీనది పునరుజ్జీవనం కోసం రబ్బర్ డ్యామ్‌లను నిర్మించింది. 2010లో మూసీ మాస్టర్ ప్లాన్‌ను అప్పటి ప్రభుత్వం రూపొందించింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2016లో నదికి భారీ వరదలు వచ్చాయి. 2017 మార్చి 25న లో తెలంగాణ ప్రభుత్వం ‘మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డిసిఎల్)’ను ఏర్పాటు చేసింది. 2020లో నదికి మళ్లీ వరదలు వచ్చాయి. 2022లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు నదీ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించి ఇందుకోసం రూ.8,973 కోట్లు కేటాయించారు. 2023 సెప్టెంబర్‌లో ఆయన, మూసీ నదిని గోదావరి జలాలతో పరిశు భ్రం చేస్తామని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. తర్వాత ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఓటమి పాలై ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడుగా వ్యవహరించడం అక్రమార్కులకు మింగుడు పడటంలేదు. ఇందుకోసమే ఈ రభస. ఈ సమస్యను అడ్డం పెట్టుకొని బి.ఆర్.ఎస్. రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తుంటే, అక్రమ ఆ క్రమణలకు పాల్పడినవారు ఏదోవిధంగా తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండటం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ప్రధాన కారణం.
ఆపరేషన్ పోలో అమరవీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లతో
భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం రాజు తద్వారా విలీనం
నిజాం ప్రభువుకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం వలన ఈ ప్రాంతం విలీనం అయినది, ప్రజలకు విమోచనం జరిగింది
భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో తో తెలంగాణ ప్రజల మానప్రాణాలను తీయడం విద్రోహం
ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది
భారతదేశమంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం రాజు చేతిలో బందీగా ఉంది. భారతదేశమంతా స్వతంత్ర పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం ఎంచుకొని నిజాం ప్రభువుకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటనలు చేస్తూ పోరాటం ముందుకు సాగించారు. ఆగస్టు 15 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం ప్రభువు చేతిలో ఇంకా బందీగా ఉంది, యావత్ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తుంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు నిజాం నిరంకుషానికి బలైపోతూనే ఉన్నారు, ఒకవైపు సాయుధ పోరాటం వల్ల నిజాం రాజుకు ముచ్చమటలు పటిస్తున్న తెలంగాణ ప్రజలు , రజాకార్లను, దేశ్ ముఖులను ఊర్ల నుండి తరిమికొడుతుంటే, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా వెళుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో సాయుధ పోరాట ప్రభావం చూపెడుతుందని భావించిన భారత ప్రభుత్వం ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి మిలటరీతో తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాదు స్టేట్ ని భారత దేశంలో కలుపుకునేందుకు నిజాం రాజు పై దండయాత్ర చేయడం జరిగింది అలా తీసుకున్న చర్యనే ఆపరేషన్ పోలోగా ఆనాటి భారత ప్రభుత్వం చెబుతుంది. భారత దేశ మిల్ట్రీ హైదరాబాద్ స్టేట్ లో అడుగుపెట్టి నిజాం రాజుకు వ్యతిరేకంగా రజాకారులతో ప్రత్యక్ష యుద్ధం లో దిగారు ఇలా కొన్ని రోజులు సాగినటువంటి ఆపరేషన్ పోలో కి తలోగ్గిన నిజాం ప్రభువు భారత దేశ హోం శాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆనాటి భారత దేశ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం, ఇక్కడ ప్రజల చైతన్యాన్ని గమనించి ఈ చైతన్యమంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కచ్చితంగా వ్యాపిస్తుందని దాని ప్రభావం యావత్ భారతదేశంపై పడుతుందని దానివల్ల భారతదేశం అంతా కూడా కమ్యూనిస్టు దేశంగా మారే అవకాశం ఉందని గ్రహించి ఆపరేషన్ పోలోను చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో ముసుగులో రజాకారులను, సామాన్యులను, ఒక వర్గ ప్రజలను మరియు సాయుధ పోరాటం వీరులను అంతం చేయడం జరిగింది. మరోవైపు చరిత్రకారుల పుస్తకాల్లో తెలంగాణ ప్రజల మానప్రాణాలను ఆపరేషన్ పోలో ముసుగులో దోచేశారని, కుప్పల కొద్దీ శవాలు విలిన తర్వాత బయటపడ్డాయని అనేకమంది మహిళలు మానాలు కోల్పోయారని చరిత్రకారుల పుస్తకాల్లో లిఖించబడ్డాయ, అందుకనే కమ్యూనిస్టులు ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించాయి, మరోవైపు భారతదేశం దీన్ని విలీనం ప్రక్రియగా ప్రకటించి ఇక్కడి ప్రజలను నిజాం నిరంకుశ పాల నుండి విమోచనం చేశామని ప్రకటించడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 యొక్క ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఈ రోజును ఒక ప్రత్యేక దినంగా తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా ఆపరేషన్ పోలో అమరవీరులకు, సాయుధ పోరాట అమరవీరులకు ఇక్కడ ప్రజల త్యాగాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకాకుండా, చరిత్రను చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర పెత్తందారులు , ఆనాటి ముఖ్యమంత్రులు ఇలా చరిత్ర కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతమై 1969లో విద్యార్థి ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా హక్కులను మేము కాపాడుకుంటామని పోరాటం చేశారు ఆనాడు వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలను బలికున్నారు ఆంధ్ర పెత్తందార , ముఖ్యమంత్రులు. ఆ తర్వాత తెలంగాణ వాదం కొన్ని రోజులు మరుగునపడిన 2001 తర్వాత అది రాజకీయ ఉనికిని పుచ్చుకొని మరో ఉద్యమంగా మారింది అలా సాగుతున్న ప్రయాణంలో 2009లో ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగింది వేలాదిమంది ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ప్రపంచ చరిత్రలో త్యాగాలు చేసిన వీరులను చూశారు కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరులను తెలంగాణ ప్రాంతంలోని చూశాను, ఎందుకంటే ఒకవైపు భారత దేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పైన చేస్తున్నటువంటి అణచివేతను తీవ్రంగా ప్రతిఘటిస్తూన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను చూసి కొంతమంది వారి ఆత్మ బలిదానాలు వలన చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయి అనుకున్నారు, అలా చాలా మంది అమరులయ్యారు అలా అమరులైన ప్రతి అమరుడికి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు చివరిగా వివిధ పార్టీలు సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించిన అధికారికంగా సెప్టెంబర్ 17న ఇంతవరకు నిర్వహించలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా ప్రకటించి అధికారికంగా నిర్వహించబోతోంది దానికి తెలంగాణ ప్రజల తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దినోత్సవం రోజున ముందుగా సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమం, మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వీరులకు, ఆపరేషన్ పోలో అమరులైనటువంటి అమాయక ప్రజలకు, వీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలకు సరైన న్యాయం చేసి, ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారి త్యాగాలకు తగిన గుర్తింపుని ఇవ్వాలని వారికి ఉద్యమకారుల పెన్షన్లతో గౌరవించాలని ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల్లో ఇళ్లను కట్టించి ఇవ్వాలని అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పెషల్ కోటను ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రభుత్వానికి ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనాప్పటికీ చరిత్రలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ ఆధిపత్య కులాలు మరియు ఆంధ్ర పెత్తందారులు ముఖ్యమంత్రులు చేసి, అమరవీరుల అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేయడం దుర్మార్గమని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన చరిత్రను ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా పుస్తకాలను రూపొందించి దేశ, విదేశాలకు తెలంగాణ చరిత్రను వ్యాప్తి చెందేలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
ఆర్టికల్ రాసింది: తాడిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు, హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్, తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం కన్వీనర్, వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్టెడ్ కాండేట్
నాది అక్రమ అరెస్టు. శనివారం డిల్లీలో కోర్టుకు హజరయ్యే సమయంలో చుట్టుముట్టి ప్రశ్నించిన మీడియాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధైర్యంగా చెప్పిన ఒకే ఒక్క మాట. కవితలో కుంగుబాటు లేదు. గొంతులో తడబాటు లేదు. అరెస్టయ్యానన్న భయం లేదు. న్యాయం తన వైపే వుందన్న నమ్మకం తోడుగా ఆమె ఈ వ్యాఖ్య చేసింది. తెలంగాణ గుండె ధైర్యం మరోసారి చూపించింది. వీరనారిలా తన అరెస్టును ఒక్క మాటలో ప్రశ్నించింది. తేల్చేసింది. తన అరెస్టు ఇల్లీగల్ అనుకుంటూ ముందుకు సాగింది. దటీజ్ పవర్ ఆఫ్ తెలంగాణ వాయిస్ అన్నట్లు వినిపించింది. ఎందుకంటే ఆరోపణలన్నీ నిజం కావు. రాజకీయ కక్షపూరిత వేధింపులు ఎప్పటికీ నిలబడవు. అబాండాలు రుజువు కావు. క్షక్ష సాధింపు చర్యలు ఎప్పటికీ ఫలించవు. విమర్శలు ఎప్పుడూ నీటి మీద రాతలే. ఎత్తిపొడుపులు పొద్దుపొడుపులు కావు. అరెస్టులన్నీ నిలబడవు. ఆత్మ స్ధైర్యం ముందు బలాదూర్. రాజకీయాలన్నీ శాశ్వతం కాదు. పదవులెవ్వరికీ జీవితాంతం తోడు కావు. కేంద్రాన్ని ఏలుతున్న వారే ఎప్పుడూ అధికారంలోనే వుండరు. పగలు, ప్రతీకారాలకు రాజకీయాల్లో చోటు లేదు. రాత్రి పగలు వున్నట్లే, ప్రతి పార్టీకి వెలుగు నీడలుంటాయి. అపనిందలు పడుతూనే వుంటాయి. నిజాయితీగా పనిచేసేవారిని వెంటాడుతూనే వుంటాయి. కాని వ్యవస్ధలో కలతలు రావొద్దు. ఆత్మహత్యా సదృష్యాలు కావొద్దు. ఇప్పుడు బిజేపి చేస్తున్నది అదే..బిజేపి హయాంలో కలుపుకుపోయే రాజకీయాలు మాయమయ్యాయి. కెలుక్కుంటూ వెళ్లే రాజకీయాలే కనిపిస్తున్నాయి. అవే రాజ్యమేలుతున్నాయి. పదేళ్లు అధికారంలో వుండడం పెద్ద గొప్పకాదు. గతంలో ఇంతకంటే ఎక్కువ కాలం రాజ్యమేలిన పార్టీలున్నాయి. కాని బిజేపిలాగా మిడిసిపడలేదు. పదేళ్లకే అహం బ్రహ్మాస్మి అన్నంత భ్రమలో బతకలేదు. బిజేపి మూలంగా మంచికి కూడా బురద రుద్దే దౌర్భాగ్యపు రాజకీయాలు కమ్ముకుంటున్నాయి. బిజేపి మూలంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు మనుగడ కోల్పోతున్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలు వుండొద్దు. కొత్తవి రావొద్దు. అవి ఎదగొద్దు. జాతీయ స్ధాయిదాక విస్తరించొద్దు. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలు డిల్లీ వైపు చూడొద్దు. ప్రజాదరణ పొందొద్దు. కేంద్రంలో కొత్తగా జాతీయ పార్టీలు పురుడు పోసుకోవద్దు. బిజేపిని మించి పోవద్దు. కాంగ్రెస్‌ను దాటి రావొద్దు. మొత్తంగా జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలు వేలు పెట్టొద్దు. కూర్చోమంటే కూర్చోవాలి. నిలుచో అంటే నిలుచోవాలి. అంతే కాని డిల్లీలో రాజకీయం చేయొద్దు. ఎదుగొద్దు. బిజేపి పెద్దలు చెప్పినట్లు తలూపితే చాలు.. వాళ్లు వద్దనుకుంటే రాజకీయంగా కనుమరుగైతేనే మేలు..ఇది బిజేపి అనుసరిస్తున్న సిద్దాంతం.. నిజానికి బిజేపి తన సిద్దాతాంతాలను ఎప్పుడో తుంగలో తొక్కింది. ఆరెస్సెస్ భావజాలాన్ని కమ్మేసింది. ముఖ్యంగా ప్రధాని మోడీ చెప్పిన సూత్రమే నడుస్తోంది. ఆయన తప్ప మరో వ్యక్తి, పార్టీ కనిపించొద్దన్న ఆధిపత్యమే కొనసాగుతోంది. అందులో భాగంగానే కవితను ముందు పెట్టి తెలంగాణ రాజకీయాలలో బిఆర్‌ఎస్‌ను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారు. రెండేళ్ల క్రితం వెలుగులోకి తెచ్చిన సంగతి నాన్చి, నాన్చి ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు కవితను అరెస్టు చేశారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో చట్టాలను అడ్డం పెట్టుకొని రాజకీయ క్షక్ష సాధింపు చర్యలు నైతికం కాదు. దక్షిణాదిన బిజేపి పాగా వేయాలి. అది రాజకీయంగా జరగాలి. ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి. ప్రజల మనసు చూరగొని సాగాలి. ప్రజల మనసు గెల్చుకొని గెలవాలి. తెలంగాణలో బిజేపి పాగా అన్నది ఒక రకంగా అత్యాశే. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఇంత కాలం ఉత్తరాధిన ఊపులో వున్నట్లు, బిజేపికి వ్యతిరేకత లేదన్నట్లు వుండి ఒక్కసారిగా ఆ పార్టీకి ఏమైంది? మోడీ ప్రభ ఎందుకు మసకబారుతోంది? బిజేపిలోనే మోడీ ప్రభావం మెల్లిగా తగ్గుతోంది. నిజానికి యూపిఏ2 తర్వాత బిజేపికి కాలం కలిసొచ్చింది. మోడీ మంత్రం ఉత్తరాదిన జపమైంది. అంతో ఇంతో దక్షిణాది కూడ కలిసి వచ్చింది. ఇక అదికారంలో వున్నప్పుడు హైందవాన్ని ముందు పెట్టుకొని మరింత రాజకీయం చేయాలని చూశారు. గత పదేళ్లుగా అనుకున్నది సాధించుకున్నారు. కాని ప్రజల్లో పదే పదే మతం ముసుగు తప్ప, ప్రగతి భావజాలం బిజేపి వదిలేసిందన్నది తేలిపోయింది. ప్రజలు అభివృద్ది కోరుకునే దశగా ఆలోచనలు చేస్తున్నారు. నిజానికి బిజేపిని రామజన్మభూమి జపం నిలబెట్టింది. ఇప్పుడు అదే బిజేపి తిరోగమనానికి కారణమౌతోంది. రామ మందిర నిర్మాణం దేశమంతా ప్రశంసించింది. కాని ఆ ప్రభావం బిజేపికి అనుకూలంగా మారినట్లు కనిపించడం లేదు. అందుకే బిజేపి కొత్త ఎత్తులకు, పొత్తులకు ఎదురుచూస్తోంది. ఓ వైపు ఈసారి 400 సీట్లు సాదిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. మరో వైపు పొత్తుల కోసం వెంపర్లాడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాదిన బిజేపి ఆశలు వదిలేసుకున్నది. ఇప్పుడు దక్షినాధిన పడిరది. ఆంద్రప్రదేశ్‌లో బిజేపికి పెద్దగా ఆశలు లేవు. కాని తెలుగుదేశం, జనసేన జతతో చిరు ఆశలతో వుంది. కాని తెలంగాణలో రాష్ట్ర నాయకులు మూలంగా తన గోతిని తాను బిజేపి తవ్వుకుంటోంది. గత శాసన సభ ఎన్నికల్లో బిజేపి గెలుస్తుందన్న భ్రమలు పటాపంచెలయ్యాయి. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఆశనిపాతం మిగిలిన, బిజేపి కవిత ఆరెస్టు ఆనాడే జరిగితే బిజేపి అదికారంలోకి వచ్చేదన్న వాదనకు బలం పెంచారు. రాష్ట్ర బిజేపి నాయకులు కేంద్ర పెద్దలచెవిలో జోరిగలుగా మోత మోగించారు. శాసన సభ ఎన్నికలకు ముందు రెండేళ్లుగా కేసిఆర్ అరెస్టు, కేటిఆర్ అరెస్టు, కవిత లిక్కర్ కేసులో అరెస్టు అంటూ నిత్యం వివాదాలు రేపేవారు. కేవలం కవిత అరెస్టు ఆగడం వల్లనే తెలంగాణలో అదికారంలోకి రాలేదన్న వాదనను కేంద్ర పెద్దల ముందు పెట్టి, కవిత అరెస్టు దాకా తెచ్చారు. రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను అంతం చేయడం అన్నది బ్రహ్మతరం కూడా కాదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న దక్షిణాదిన బిజేపికి స్ధానం వుండదు. దక్షిణాదిన రాజకీయం చైతన్యం ఎక్కువ. ఉద్యమాల ఉనికి వుంటుంది. పోరాటాల చరిత్ర వుంటుంది. స్వశక్తి మీద జీవించాలన్న పట్టుదల వుంటుంది. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులుంటాయి. యువతలో వివేకం, చైతన్యం వుంటుంది. వాటిని నమ్ముకోకుండా, కేవలం ఆరోపణలు,అరెస్టులతో ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలని చూస్తే దక్షిణాది జనం అంగీకరించరు. పార్టీ కార్యకర్తలు, నాయకులు చెప్పే విషయాలలో నిజా నిజాలను గ్రహించకుండా నిర్ణయాలుతీసుకుంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. కవిత అరెస్టుతో కేసిఆర్‌ను కట్టడి చేయొచ్చన్న ఆలోచనే బిజేపి పతనానికి నాందిగా మారనున్నది. కేసిఆర్ తెలంగాణకు మార్గం. ఆత్మగౌరవానికి నిదర్శనం. ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టాలంటే ఆయనను మించిన సంక్షేమం చేసి చూపించాలి. కాని కేసిఆర్‌ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూస్తే రక్షణ కవచం తెలంగాణ సమాజమే నిలబడుతుంది. అది తెలుసుకోకుండా బిజేపి ముందుకెళ్లింది. శాసన సభ ఎన్నికల ముందు చేసిన తప్పిదం ఇప్పుడు చేస్తే పార్లమెంటు సీట్లు ఆగమౌతాయనుకున్నారు. ఎన్నికల సమయంలో కేసిఆర్ కట్టడి చేయాలని పగటి కలలు కంటున్నారు. ఈడీ వస్తుందా? బోడి వస్తుందా? అని సవాలు చేసిన కేసిఆర్‌ను కట్టుదిట్టం చేస్తాం..కాళ్లు చేతులు కట్టేస్తామంటే…కుదిరే పనికాదు. కేసిఆర్‌ను రాజకీయంగా అణిచి వేయడం ఎవరి వల్లా కాదు. కవితను అరెస్టు చేసి, కేసిఆర్‌ను మరింత నిద్రలేపారు..ఆయనను పగపట్టామని అనుకుంటున్నారు. కాని కేసిఆర్‌ను దెబ్బకొట్టడం బిజేపి వల్ల కాదు.
చెరిపేయడానికి గీతలు కాదు, ఉక్కు సంకల్పంతో చెక్కిన శిల్పాలు.
చరిత్రకు నేర్పిన తెలంగాణ ఉద్యమ పాఠాలు.
వేలెత్తి చూపినంత మాత్రాన చెదిరేవి కాదు.
తూలనాడితే తుడిచిపెట్డుకుపోవు.
ఎద్దేవా చేస్తే ఎగిరిపోవు.
నిందలేస్తే నీటి మీద రాతలు కాదు.
హరీష్ అడుగులు ఉద్యమ భీజాలు.
ఉద్యమ పోరు భీజాక్షరాలు.
తెలంగాణ సాధనకు వేసిన మార్గాలు.
తెలంగాణ సాధనలో అలుపెరగని ధీరుడు.
తెగించి కొట్లాడిన వీరుడు.
ఎదిరించి నిలబడిన ధీరోదాత్తుడు.
తెలంగాణ కోసమే జీవితాన్ని రణం చేసుకున్న పోరాటయోధుడు.
నేటిధాత్రి హైదరాబాద్:
అధ్భుతమని తెలిస్తే అందరూ ముందుకొస్తారు. ముళ్లబాట అని తెలిస్తే అందరూ వెనకడుగు వేస్తారు. కాని నడవాలనుకున్నప్పుడు ముళ్లెదురైనా, రాళ్లు రప్పలు అడ్డొచ్చినా, వాగులు, వంకలు దాటాల్సివచ్చినా ముందుకు వెళ్లేవారే లక్ష్యసాధకులు. ఆ లక్ష్యం ప్రజాకాంక్ష అయితే ముళ్లను తొక్కుకుంటూ, వెనక వచ్చేవారికి దారి నేనౌతా! బాటనేనౌతా!! అని అవరోధాలుకు వెరవకుండా ముందుకు నడిచేవాళ్లే ప్రజలకు గుండెల్లో నిలుస్తారు. చీకటిని చూసి పారిపోరు. పోరుకు వెలుగులద్దుతారు. ప్రజలకు వెలుగులు పంచుతారు. ప్రజల మేలు కోసం ఎంతటి చీకటైనా చీల్చి చెండాడుతారు. వెలుగుల ప్రభాతం కాంతులు వెదజల్లుతారు. అలాంటి వాళ్లలో ఒక్కడుగా చరిత్ర చెక్కిన యోధుడుగా, సంగం చెక్కిన శిల్పాలలో ఒకే ఒక్కడుగా వెలుగొందుతారు. అది తన్నీరు హరీష్‌రావై మన కళ్లముందు కనిపిస్తారు. తెలంగాణ కోసం హరీష్‌రావు చేసిన దానిని గురించి ప్రస్తావించినా కనీసం పుణ్యమైనా దక్కుతుంది. కాఇన ఎగతాలి చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. ఆనాడు ఎలాగూ స్వార్ధంకోసం తెలంగాణ కోసం మాట్లాడలేదు. ఇప్పటికైన తెలంగాణ కోసం కొట్లాడిన హరీష్‌రావు త్యాగాన్ని కొనియాడండి. లేకుంటే మీ రాజకీయ జీవితానికి కూడా అర్ధం వుండదు. తెలంగాణ ఉద్యమం ఒక్క రోజో,రెండు రోజులో సాగింది కాదు. ఏడాదో, రెండేళ్లు చేసి ఆపింది కాదు. నిరంతరంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఏక బిగిన, విరామం అంటూ లేకుండా సాగింది. అంతటి కాలంలో నిత్యం తెలంగాణ నామ స్మరణతో కాలం గడిపిన నాయకుడు హరీష్‌రావు. నిత్యం తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో ఎంతో విలువైన జీవితాన్ని గడిపిన నాయకుడు హరీష్‌రావు. అందరూ కుటుంబాలతో, పండగలు, పబ్బాలు గడుపుకుంటూ వుంటుంటే, హరీష్‌రావు ఆ పద్నాలుగేళ్లు జరుపుకున్న పండుగ లేదు. కడుపు నిండా అన్నం తిన్న రోజు లేదు. నిరంతరం ప్రజల మధ్యే, ప్రతి నిమిషం తెలంగాణ కోసమే…అదీ హరీష్‌రావు ఉద్యమ జీవితం. ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందో…తెల్లారితే ఏ పేపర్‌లో ఏ విషాద వార్త చదవాల్సి వస్తుందో…అని కంటిని నిండా నిద్ర లేని రాత్రులు గడిపిన ఉద్యమకారుడు హరీష్‌రావు. తెలంగాణలో ఏ మూలనో ఉద్యమకారుడు బలిదానం చేసుకున్నాడని తెలిసిన వెంటనే అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా అక్కడికి చేరుకొని, ఆ కుటుంబాలకు అండగా నిలిచి, వారికి బాసగటా నిలిచిన నాయకుడు హరీష్‌రావు…వీటిలో ఏ ఒక్కటైనా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా చేశాడా? అంతకాలం జై తెలంగాణ అని ఎవరైనా నినదించారా? తెలంగాణ కోసం కొట్లాడారా? అధికారంలోకి వచ్చాం కదా? అని మాటకు ముందు, మాటకు వెనకాల హరీష్‌రావు ఉద్యమ చరిత్రను కించపర్చాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హరీష్‌రావును త్యాగాన్ని తక్కువ చేసి చూపించాలని ఆ పార్టీ నాయకులు తెగ తాపత్రయపడుతున్నారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లు కూడా హరీష్‌రావు గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో వుంటూ, తెలంగాణపై , విషం కక్కిన వాళ్లు కూడా హరీష్‌రావు ఉద్యమాన్ని హేళన చేస్తున్నారు. ఏ ఒక్కనాడు జైతెలంగాణ అనడానికి కూడా నోరు రాని వాళ్లు కూడా హరీష్‌రావు చేసిన ఉద్యమం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణను బలిపెట్టేవారి పంచన చేరిన వారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని గురించి ప్రస్తావించడం విడ్డూరం. ఏనాడు తెలంగాణ అమరవీరులను స్మరించని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పలకు పోతున్నారు. తెలంగాణ ఉద్యమంటే అబద్దాలు చెప్పి, అదికారంలోకి వచ్చినంత సులువనుకుంటున్నారు. అగ్గిపెట్టె అంటూ ఎద్దేవాలు చేస్తున్నారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చున్న కుర్చీ ఒక రకంగా హరీష్‌రావు పెట్టిన బిక్షే. ఎందుకంటే ఉద్యమ ప్రస్తానమంతా మొత్తం చూస్తే కనిపించే అతికొద్ది త్యాగధనుల్లో, పోరాట యోధుల్లో హరీష్‌రావు ముందు వరసులో వుంటారు. కేసిఆర్ తర్వాత హరీష్‌రావే కనిపిస్తారు. అలాంటి నేత చేసిన సుధీర్ఘ ఉద్యమంపై మాట్లాడే అర్హత ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి లేదు. అసలు తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించే నైతికత ఏ ఒక్క కాంగ్రెస్ నేతకు లేదు. తెలంగాణ వచ్చినా, ఆనాడు కేంద్రంలో వున్న యూపిఏ ఇచ్చినా అది కేసిఆర్ పోరాటమే..హరీష్‌రావు నడిపిన ఉద్యమమే… ఏ తెలంగాణ ఉద్యమకారుడు చెప్పినా ఇదే ఫైనల్…
ఏం తెలుసు మీకు హరీష్‌రావు గురించి. ఆయన పోరాటం ఒక వైపు, రాజకీయం మరో వైపు రెండు వ్యూహాలను ఏక కాలంలో నిర్వర్తించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన నాయకుడు హరీష్‌రావు. తెలంగాణ సాదకుడు కేసిఆర్ అడుగు జాడల్లో నడుస్తూ, తెలంగాణ ఉద్యమ పోరాటంలో తొలి అడుగులు వేసిన ఉద్యమ సైనికుడు హరీష్‌రావు. కేసిఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు కొన్ని నెలల ముందునుంచి సిద్దం చేసిన యాక్షన్ ప్లాన్‌లో భాగస్వామి హరీష్‌రావు. తొలి కార్యకర్త కూడా ఆయనే అని చెప్పాలి. అప్పటికే కేసిఆర్‌తో ఎంతో మంది మేధావులు కలిసి వచ్చినా పార్టీపరంగా క్రియాశీలకపాత్ర పోషించిన వారిలో హరీష్‌రావు మొదటి వ్యక్తి అనే చెప్పాలి. ఆ తర్వాతే ఎవరైనా అన్నది కూడా అందరికీ తెలిసిందే. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ కొన్ని నెలల పాటు సాగించిన చర్చలు, సంప్రదింపులు, అధ్యయనాలలో హరీష్‌రావు సహాకారం చాలా విలువైంది. కేసిఆర్ చెప్పిన ప్రతి పనిని తుచ తప్పకుండా అనుసరించి, పాటించి అమలు చేసిన నాయకుడు హరీష్‌రావు. సహజంగా యుక్త వయసులో ఏ వ్యక్తికైనా తన వ్యక్తి గత జీవితం, సంతోషం, సరదాలు మీద కలలు కంటుంటారు. కాని హరీష్‌రావు జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమమే కనిపిస్తుంది. తెలంగాణ ఆకాంక్షనే వుంటుంది. నిజానికి ఆయనకు ఊహ తెలిసినప్పటికే తెలంగాణ భావన మది మొత్తం నిండిపోయింది. ఆది నుంచి కేసిఆర్‌తో వుండడం, ఆయనతో సాన్నిహిత్యం, కేసిఆర్‌భావజాలం చూస్తూ పెరిగిన వ్యక్తి హరీష్‌రావు. అందువల్ల ఆయనకు సహజంగానే తెలంగాణ అన్నది నరనరనా జీర్ణించుకుపోయి వుంటుంది. అందుకే ఎంతో గొప్ప గుణం,విభిన్నమైన మనస్తత్వం, ప్రజలతో మమేకమయ్యే జీవన విధానం అలవడిరది.
ఉద్యమ జీవితాన్ని ఎంచుకోవాలంటే ఎంతో దైర్యం కావాలి. పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలి. అన్నింటికీ సిద్దపడి ముందుకు రావాలి. ఎంతో విజ్ఞత వుంటే తప్ప యుక్తవయసులో ఉద్యమ స్వరూపానికి తోడుగా నిలవడ లేరు. ఇక కేసిఆర్ తెలంగాణ ఉద్యమం పూర్తి స్దాయిలో మొదలుపెట్టాక, హరీష్‌రావు కూడా తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశాడు. అభివృద్ధి మా ప్రాంత హక్కు…తెలంగాణ మా జన్మ హక్కు అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు హరీష్‌రావు అని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ ఉద్యమంలో నేనూ ఆది నుంచే వున్నప్పటికీ, మా పాత్ర జిల్లా వరకు, ఉత్తర తెలంగాణ వరకు పరిమితమైంది. కాని హరీష్‌రావు పాత్ర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ప్రతి విషయాన్ని , సందర్భాన్ని స్వయంగా పంచుకున్న అనుభవం నాకు వుంది. ఉద్యమ ప్రస్ధానంలో ఎన్నికల బాధ్యత అన్నది ఎంతో కీలమైంది. దాన్ని హరీష్‌రావు ఎంత బాద్యతగా నిర్వర్తిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం వేరు…ఉద్యమ కాలంలో ఎన్నికల ప్రచారం వేరు. అడుగుడుగునా ఆటంకాలు. తెలంగాణ ఉద్యమం లేదని నిరూపించే ప్రయత్నం చేసేవాళ్లు కాచుకొని కూర్చునే వాళ్లు… పైగా తెలంగాణలో కూడా తెలంగాణ వ్యతిరేకులు చేసే కుట్రలు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భం కత్తి మీద సామే…ముఖ్యంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భాలలో హరీష్‌రావు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. తాను రాజీనామా చేసినా, తన గెలుపే కాదు…మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకొని, ముందుకు నడిచిన నాయకుడు హరీష్‌రావు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా పరిస్ధితులు తారుమారయ్యే అవకాశాలున్న రోజులవి. ప్రజలను ఎంతో నమ్మకంగా తెలంగాణ ఉద్యమం వైపు మళ్లిస్తున్న కాలంలో అటు తెలంగాణ వాదులు, ఇటు మేధావులతో మమేకమైన సాగడం అన్నది ఎంతో ఓర్పుతో కూడుకున్నది.
తెలంగాణ ఉద్యమాన్ని ఉప్‌మని ఊదేద్దామని చూసే వారూ చూస్తూనే వుండేవారు. జలదృష్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేని అప్పటి ప్రభుత్వం ఏకంగా ఆ నివాసాన్ని కూడా కూల్చేసింది. పార్టీకి నీడ లేకుండా చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో కేసిఆర్ ముందకు సాగడంలో హరీష్‌రావు పోషించిన పాత్ర చాలా విలువైంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు , నాయకులను పలుచన చేద్దామని డేగ కళ్లతో అప్పటి పాలక, ప్రతిపక్ష పార్టీలు చూసేవి. వాటిని తట్టుకుంటూ, ఎదుర్కొంటూ, నాయకులను కాపాడుకుంటూ , వారి ఆటలు సాగకుండా పార్టీని సైతం రక్షించుకున్నవారిలో హరీష్‌రావు ఒకరు. టిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్టు మీద గెలిచి, తెలంగాణ వాద ముసగు వదిలసే ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్లు కూడా వున్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా వుండడంలో హరీష్‌రావు క్రియాశీలకపాత్ర పోషించారు. అనేక మందిని పార్టీలోకి తీసుకురావడంలో కూడా ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనను ట్రబుల్‌షూటర్ అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో కేసిఆర్ విసృతం ప్రచారంలో వుంటే, హరీష్‌రావు ఊరూర తెలంగాణ జెండా ఎగరేసే పనిలో నిమగ్నమై, పార్టీ ఊరూరికి విస్తరించడంలో హరీష్‌రావు బలమైన ముద్ర వేశారు. మొదటిసారి కేసిఆర్ సిద్దిపేట నుంచి వరంగల్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ సమయంలో ముందు ప్రతి ఊరిలో హరీష్‌రావు పార్టీ జెండా ఆవిష్కరిస్తూ వెళ్లడం, కేసిఆర్ సైకిల్ యాత్ర సాగడం ఇప్పటికీ నాటి ఉద్యమారులకు గుర్తే వుంటుంది. ఆ తర్వాత సభల నిర్వహణ బాధ్యతలు కూడా హరీష్‌రావు మీదే పడేది. తొలిసారి కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సింహ గర్జన దగ్గర నుంచి 2023 ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మర్చిన తర్వాత జరిగిన ఖమం తొలి సభ వరకు ఆయన చేపట్టిన సభలన్నీ విజయవంతమైనవే. ఇక వరంగల్‌లో మహాగర్జన పేరుతో సుమారు 15 లక్షల మందితో సభ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఆ సభ ఒక చరిత్ర. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులు పొందిన వారైనా,రాజకీయంగా ఎదిగిన వారైనా, ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చినవారైనా, కొత్తగా ఉద్యోగాలు పొందిన వారైనా, వేల కూడా పలకని భూములు కోట్లు విలువ చేస్తున్నాయంటే అది తెలంగాణ పుణ్యం. హరీష్‌రావు లాంటి వారి ఉద్యమఫలితం. ఉద్యమకారులను ఎవరు తక్కువ చేసిన మాట్లాడినా, తమను తాము తక్కువచేసుకున్నట్లే..తమను తాము నిందించుకున్నట్లే…తమ అస్దిత్వాన్ని తామే అమ్ముకున్నట్లే…హరీష్రావునువిమర్శించడం అంటే తెలంగాణ పతానకు అవమానించడమే..అదీ హరీష్‌రావు ఉద్యమ రాజకీయ చరిత్ర. ఇంతటి చరిత్ర వున్న వాళ్లు కేసిఆర్ తర్వాత ఒక్క హరీష్‌రావుకేవుంది. దటీస్ హరీష్‌రావు. ఏనీ డౌట్.
గత ఏడాది దళిత బంధు పథకం ద్వారా వరంగల్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 303 మంది లబ్ధి పొందారు.
వరంగల్‌లో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చిన జిల్లా యంత్రాంగం దళిత బంధు పథకం ద్వారా 3,486 యూనిట్లను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి యూనిట్‌కు రూ.10 లక్షలు అందజేస్తోంది. గత ఏడాది ఈ పథకం ద్వారా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 303 మంది లబ్ధి పొందారు.
ఈ పరివర్తన పథకం ఒక నమూనా మార్పును ఉత్ప్రేరకపరిచింది, ఉద్యోగులను గర్వించదగిన యజమానులుగా మార్చింది. దళిత బంధు యాప్‌లో ప్రాథమిక లబ్ధిదారులు మరియు వారి సంబంధిత యూనిట్ల వివరాలు సజావుగా విలీనం చేయబడిందని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఫోటోలు మరియు వీడియోలు ఖచ్చితమైన రుజువుగా పనిచేస్తాయి, ఇది కఠినమైన క్షేత్రస్థాయి పరిశీలనకు వీలు కల్పిస్తుంది. దళిత బంధు పథకం యూనిట్లను అట్టడుగు స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రభుత్వం యాప్‌ను ప్రవేశపెట్టింది.
“రెండవ దశతో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,100 మంది వ్యక్తులకు యూనిట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లా పరిధిలోని 3,486 యూనిట్లలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.348.60 కోట్లు కేటాయించారు. ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇప్పటివరకు 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఓ అధికారి తెలిపారు.
రెండ్రోజుల క్రితం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రవిణ్య మాట్లాడుతూ, “ప్రత్యేకమైన అధికారుల బృందం ఈ దరఖాస్తులను ధృవీకరిస్తోంది, పారదర్శకతను నిర్ధారిస్తుంది. వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు.
`ఆర్డర్ కాపీ లేకుండా వెట్టి చాకిరీ చేయించుకున్న ఉమ్మడి పాలకులు
`జై తెలంగాణ అన్నందుకే పోయిన హోం గార్డు కొలువులు
`251 మంది తెలంగాణ బిడ్డలకు జరగాలి న్యాయం.
`పోయిన కొలువు రాక! బతకలేక!!బతుకులేక!!!
`ఆ బాధ్యత ను సీఎం కెసిఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అప్పగించారు.
`ఆనాటి నుంచి మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
` కొవ్వొత్తిలా కరిగిన కాలం!
` కనికరం కోసం నిరీక్షణం.
`ఆశలు మాయం.
`అవకాశాలు శూన్యం.
`కానరాని భవితవ్యం.
`ప్రభుత్వం మీదనే భారం.
` ఎదురుచూపులతో క్షీణిస్తున్న ఆరోగ్యం.
`ఇప్పటికే మంత్రుల భరోసా సాయం.
`ఆ ఆశలే వారికి సజీవం.
`గోడకు వేళాడుతున్న నాటి ఖాకీ దుస్తుల ఆరాటం.
హైదరబాద్,నేటిధాత్రి:
కొందరి కష్టం పగవాడికి కూడా రావొద్దనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు చేసిన అన్యాయం ఎలాంటిదో వీరిని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ యువత అంటే ఉమ్మడి పాలకులకు ఎంత కోపమో! ఎంత నిర్లక్ష్యమో ఈ హోం గార్డులను చూస్తే చాలు. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో అవగతమవుతుంది. సుమారు దశాబ్ద కాలం పాటు తెలంగాణకు చెందిన వారి చేత వెట్టి చాకిరి చేయించుకొన్నారు. ఒక ప్రభుత్వం చేయకూడని పని. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాం. అన్యాయం జరిగితే పోలీసులకు పిర్యాదు చేస్తాం. అలాంటిది పోలీసుల శాఖకు అనుబంధమైన వింగ్ హోం గార్డులకే అన్యాయం జరిగింది. అది కూడా పోలీసు శాఖ మూలంగానే జరిగింది. మరి వాళ్లు ఎవరికి మొరపెట్టుకోవాలి. గోడు ఎవరికి వినిపించుకోవాలి. కేవలం తెలంగాణ ఉద్యమం మీద కోపంతో హోం గార్డులను ఉమ్మడి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలిగించింది. అర్థాంతరంగా ఉద్యోగాల నుంచి తీసేసి, వారి జీవితాలను చీకట్లు చేశారు. ముళ్లును ముళ్లుతోనే తీయాలని కుట్ర పన్నిన ఉమ్మడి పాలకులు తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడిరది. తెలంగాణ ఉద్యమ అణచివేతను తెలంగాణ నిరుద్యోగుల చేతనే అమలు చేయాలని చూసింది. అందులో భాగంగా హోం గార్డ్ ఉద్యోగాలను తెలంగాణ యువతకు ఎరగా వేసింది. కొలువుల ఆశ చూపింది. తెలంగాణ యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. ఉద్యమ సమయంలో తెలంగాణ హోం గార్డులతో ఉద్యమానికి ఆటంకాలు సృష్టించాలని చూశారు. కానీ తెలంగాణ గడ్డ మీద వున్న ప్రేమతో ఆ హోం గార్డులు ఆ పని చేయలేకపోయారు. అది గమనించిన ఉమ్మడి పాలకులకు గిట్టలేదు. అప్పటి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దాంతో ఆ హోం గార్డులందరినీ తొలగించింది. అయినా ఆ హోం గార్డులు భయపడలేదు. భవిష్యత్తు గురించి ఆ సమయంలో గాభరా పడలేదు. ధైర్యం చెడలేదు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయన్న నమ్మకంతో వున్నారు. న్యాయం ఎప్పటికైనా తమ వైపే వుంటుందని నమ్మారు. ఎలాగైనా తెలంగాణ వస్తుందన్న అచెంచలమైన విశ్వాసం వారిని ముందుకు నడిపింది. మరో వైపు వారి న్యాయ పోరాటం సాగింది. అక్కడ వారికి చుక్కెదురైంది. తెలంగాణ వస్తుంది ఏనాటికైనా మళ్లీ మన కొలువు మనకు వస్తుందన్న నమ్మకం వారిలో ఆనాడే నాటుకుపోయింది. కానీ అది నేటి వరకు తీరక కలగానే మిగిలిపోయింది. పోయిన కొలువులు రాకుండా పోయాయి. ఆశ మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే వుంది. మన తెలంగాణ లో వేసుకుందామనుకున్న ఖాకీ డ్రెస్సు ఇంకా వారి ఇంటి గోడలకు వేలాడుతూనే వుంది. ఆ డ్రెస్సును నిత్యం ఎదురుచూస్తుంటే కాలం కొవ్వొత్తిలా కరిగిపోతూనే వుంది. కన్నీళ్ల వరద ఆగనంటోంది. తరుముతున్న ఆకలి కోసం పరుగులు, పోయిన కొలువుకోసం ఆగని దిగులు, కన్నీళ్లు నిత్యకృత్యమయ్యాయి. కళ్లలో ఒత్తులేసుకొని కొలువు కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
తెలంగాణ లో ఉద్యోగాలు కోల్పోయిన 251 మంది ఉద్యోగుల సమస్యలు 2018లోనే ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఆ సమయంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసిఆర్ కు కూడా తెలుసు. వారికి ఉద్యోగ కల్పన చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఇదే సమయంలో అంతకు ముందు వున్న హోం గార్డుల జీతాలు పెంచిన సంగతి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పని చేసి, తొలగింపబడిన హోం గార్డులను తిరిగి వీధుల్లోకి తీసుకుంటామని సిఎం కేసిఆర్ మాటిచ్చారు. ఆ బాధ్యతను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అప్పగిస్తున్నట్లు సిఎం అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఈ హోం గార్డులు కాళ్లరిగేలా తిరుగుతూనే వున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను నాటి నుంచి తరుచూ కలుస్తూనే వున్నారు. అంతే కాకుండా ప్రణాళికా సంఘం చైర్మన్ బి. వినోద్ కుమార్ ను కూడా కలిశారు. హోం మంత్రి మహమూద్ అలీని కలిశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి విజ్ఞాపన చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకరించాల్సింత సహకరిస్తూనే వున్నారు. తెలంగాణ లోని అందరు ఎమ్మెల్యే ల లెటర్లు కూడా ప్రభుత్వానికి అందజేశారు. కాలం గడిచిందే గాని పని కాలేదు. తాజాగా మళ్ళీ వీరి ప్రస్తావన అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మంత్రి కేటిఆర్ దృష్టికి వెళ్లింది. ఆ విషయం పరిశీలిస్తానని కేటిఆర్ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీరి విషయాన్ని మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.
అప్పటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించేదో, తెలంగాణ యువత జీవితాలతో ఆడుకున్నారో, ఆగం చేశారో అర్థమౌతుంది.
తెలంగాణ కు ఎలా అన్యాయం చేసే వారో ఈ హోం గార్డులే నిదర్శనం. తెలంగాణ ఉద్యమ అప్పటి ఉద్యమ కారుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున సాగుతున్న సమయం. అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున హోం గార్డులను రిక్రూట్ చేసుకున్నది. అందులో ఎక్కువ శాతం సీమాంధ్రుకే ఉద్యోగాల కల్పన జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాదులో సీమాంధ్రులకు హోం వార్డులుగా అవకాశం కల్పించారు. కొంతమంది తెలంగాణ యువతకు కూడా మొక్కుబడిగా అవకాశమిచ్చారు. ఉద్యోగ కల్పన చేశారే గాని ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదు. కేవలం ఐడెంటిటీ కార్డ్ లు మాత్రమే జారీ చేశారు. జీతాలిస్తూ పోయారు. వీళ్లను రెగ్యులరైజ్ చేయాల్సిన సమయంలో ఉద్యోగాల నుంచి తొలగించేశారు. వీరుతో పాటు అప్పట్లో కొలువుల్లో చేరిన సీమాంధ్రులకు మాత్రమే ఆర్డర్ కాపీలు ఇచ్చారు. వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేశారు. తెలంగాణ హోం గార్డులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తున్నారన్న నెపంతో ఉద్యోగాల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లు న్యాయ పోరాటం చేస్తూనే వున్నారు. ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూనే వున్నారు. ఇప్పుడైనా తమను కనికరించాలని కోరుతున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఏ ముహూర్తాన దాశరధి అన్నారో నిజంగానే అంతటి గొప్ప తెలంగాణ ఆవిష్కరింపబడుతోంది. తొలి తెలుగు నాగరికతకు పురుగు పోసుకున్న శాతవాహనుల కోటి లింగాల నుంచి, ఇక్ష్వాకులు,విష్ణుకుండినుల నుంచి కాకతీయ రాజుల పాలనలో బంగారు తెలంగాణ కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా ఎంతో గొప్ప తెలంగాణ ఆవిష్కృతమైంది. ఎప్పుడైతే సీమాంద్రులు తెలంగాణతో కలిశారో అప్పటి నుంచి తెలంగాణను పతనం చేస్తూ వచ్చారు. తెలంగాణను గోసపెట్టారు. ఎంతో గొప్ప చరిత్ర వున్న తెలంగాణను చరిత్రహీనంగా మార్చేశారు. తెలంగాణ బతుకు చిద్రం చేశారు. అభివృద్దికి ఆమడ దూరం చేశారు. ఆనాటి నుంచి మొదలై పోరు ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో మలి దశలో విజయం సాధించింది. తెలంగాణ సాధన జరిగింది. పద్నాలుగేళ్లపాటు సాగిన తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తేతే, పదేళ్ల కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ది ఒక ఎత్తు. ఇదే అభివృద్ది డెబ్బై ఏళ్లుగా సాగితే, తెలంగాణ ఇప్పటికే ఒక గొప్ప ప్రాంతంగా విరాజిల్లేది. తెలంగాణ సందన దోచుకోవడానికి కలిసిన సీమాంధ్రులు, తెలంగాణను పీల్చి పిప్పి చేయడానికే ప్రాదాన్యమిచ్చారు. తెలంగాణ నీటి వాటాలు వాడుకుంటే సీమాంద్రకు కష్టాలని ప్రాజెక్టులు నిర్మించలేమని మభ్యపెడుతూ మోసం చేశారు. తెలంగాణ నాయకుల రాజకీయ అవకాశవాదులను గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణను అడుగడుగునా, అణువణువునా మోసం చేశారు. తెలంగాణకు భవిత లేకుండా చేశారు.
తెలంగాణ అంటే ఒక శకం.
ముఖ్యమంత్రి కేసిఆర్ అంటే ఒక నవ శకం. అరవై ఏళ్ల గోసను తీర్చడానికి కారణజన్ముడై వచ్చిన కేసిఆర్ తెలంగాణను బంగారు తునక చేస్తున్నాడు. భవిష్యత్తు తరాలకు బంగారు మయమైన తెలంగాణ అందిస్తున్నాడు. సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఊహిస్తేనే ఆ ఊహ కూడా ఆశ్చర్యపోతుంది. నాడు దిగాలు పడిన తెలంగాణ నేడు సంబరంతో నాట్యమాడుతుంది. అంతగొప్పగా తెలంగాణ ఆవిష్కరణ జరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రగతి, పురోగతి ఒక్క తెలంగాణలో వుంది. అది కేసిఆర్ నాయకత్వంతోనే సాధ్యమౌతోంది. తెలంగాణ ను వరాల తెలంగాణ చేసి, తెలంగాణ ప్రజ కలలు గన్న తెలంగాణ అందిస్తున్నారు. సుసంపన్నమైన తెలంగాణను బహుమానంగా ఇస్తున్నాడు. తాజాగా క్యాబినేట్ నిర్ణయాలు తెలంగాణకు మరింత వన్నెలు అద్దేలా వున్నాయి. అందులో ప్రజల కోరికలతో పాటు, రేపటి తరం ఆశలు కూడా తీరే నిర్ణయాలు తీసుకున్నారు.
ఎప్పటి నుంచో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని కోరుతున్నారు.
దానిపై గతంలోనే సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నివేదికను అనుసరించి వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43వేల మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి దాకా కార్పోరేషన్ పరిధిలో ఉద్యోగులుగా వున్న వాళ్లంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇది గొప్ప శుభ తరణం. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది గొప్ప పాత్ర. సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులు అప్పటి ఉమ్మడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. నిత్యం ధీక్షల్లో కార్మికులు కూడా భాగస్వాములయ్యారు. అంతే కాకుండా కొత్తగా రిక్రూట్ చేసుకొని కొత్తవారితో ఆర్టీసీ నడిపేందుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దాన్ని అడ్డుకోవడంలో కూడా విజయం సాధించారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులది ప్రత్యేక పాత్ర. అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆర్టీసి కార్మికుల జీతాలు గణనీయంగా పెంచారు. 53శాతం ఫిట్ మెంటు ఇచ్చి ఏవరూ ఊహించని కానుకనందించారు. ఆ తర్వాత తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కోరుతూ వచ్చారు. వారి కోరికను మన్నించిన ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలోనే ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు వారిని ఉద్యోగులుగా గుర్తించి, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకోడం జరుగుతోంది.
ఇక హైదరాబాద్ ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన విధంగానే హైదరాబాద్‌ను గొప్పగా ఆవిష్కరించారు.
అటు ఉద్యమ సాధనకు విజయాలుగా పల్లె నుంచి మొదలు పట్నం దాకా మౌలిక వసతుల సదుపాయాల కల్పనతో తెలంగాణను అగ్రగామిగా నిలిపారు. తాజాగా మంత్రి మండలి నిర్ణయం మేరకు నగరం చుట్టూ సుమారు 500 కిలోమీటర్ల పరిధిలో మెట్రోను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తెలంగాణను ఊహించుకుంటేనే అందమైన భూతల స్వర్గంగా మారనుంది. ప్రస్తుతం సుమారు 73 కిలోమీటర్ల పరిధిలో వున్న మెట్రోను నగరానికి నాలుగు వైపులా విస్తరిస్తే, హైదరాబాద్ దేశంలోనే అతి పెద్ద నగరంగా ఆవిషృతమౌతుంది. తూర్పున ఉప్పల్ నుంచి బిబీ నగర్ వరకు మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పశ్చిమాన శంషాబాద్ వరకు విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు విస్తరణ జరగనుంది. ఉప్పల్ నుంచి ఉత్తరం వైపు ఈసిఐఎల్ వరకు చేపట్టనున్నారు. అటు మియాపూర్ నుంచి లక్డికాపూల్‌కు, రాయదుర్గం నుంచి శంషాబాద్, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ జరిగితే నగరంలో ట్రాఫిక్‌సమస్య వుండదు. హైదరాబాద్ విస్తరణ మరింత పెరుగుతుంది. హైదరాబాద్‌కు చుట్టూ 50 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. ఇక మరో సరికొత్త ఆవిష్కరణ. జేబిఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలా వుంటే నగరంలో మరో ఎయిర్ పోర్టు ఏర్పాటు అసరమని ప్రభుత్వం గుర్తించింది. హకీం పేట ఎయిర్‌పోర్టును వాడుకునేందుకు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇప్పటికే ఐటి రంగం విస్తరించి, ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పూర్తయితే నగరం రూపు రేఖలే మారిపోతాయి.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.