వడ్ల కొనుగోలు పరిశీలించిన డిఎస్. చౌహాన్.

రైతులు, అధికారుల ముందే కొనుగోలు సమీక్ష.

ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దని ఆదేశాలు.

రైతులకు చెల్లింపులలో జాప్యం జరగొద్దని సూచన.

హన్మకొండ జిల్లాలో వడ్ల కొనుగోలు జరుతున్న కేంద్రాలను రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్.చౌహాన్ శనివారం సందర్శించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. 

అందులో భాగంగా పి.ఎ.సి.ఎస్. ఉనికిచెర్ల,పి.ఎ.సి.ఎస్. ధర్మసాగర్, ఐకేపి ధర్మసాగర్, పి.ఎ.సి.ఎస్. తెల్లాకులగూడెంలలో వడ్ల కొనుగోలు తీరును పర్యవేక్షించారు. వడ్ల కొనుగోలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలోనే అటు అధికారులు, ఇటు రైతులతో చౌహాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా జరగడానికి హార్వెస్టర్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుండి అందే వాతావరణ సూచనల ఆధారంగా ప్రతి పిసిసి లో కొనుగోలు చర్యలను సక్రమంగా కొనసాగించాలని సూచించారు. వడ్ల నాణ్యత కోసం ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు ఉపయోగించాలన్నారు‌. ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు చెల్లింపులు త్వరగా చేయాలని ఆదేశించారు. వడ్లు కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వడ్ల కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలన్న కృత నిశ్చయంతో వుందని చౌహాన్ తెలిపారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చౌహన్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ .!

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ శిక్షణ కేంద్రాల ఇంచార్జీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ప్రధాన కార్యాలయంలో సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాల ఇంచార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జహీరాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు పాల్గొన్నారు.ఈసమావేశంలో సెట్విన్ సంస్థ ఇంచార్జీలు,అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ .

తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ( ఐ ఎన్ టి సి 327) ఘనంగా మేడే వేడుకలు

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి

 

 

 

ఈరోజు తొర్రూరు డివిజన్లో ఐ ఎన్
టి సి 327
సంఘం ఆధ్వర్యంలో మే డేను ఘనంగా నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు కే భోజలు జెండా ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.
ఇకార్యక్రమంలో మహబూబాబాద్ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ పాషా, మరియు జిల్లా నాయకులు పసుపులేటి మధు తొర్రూరు డివిజన్ కార్యదర్శి డి సికిందర్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగరాజు, డీసెంట్ ట్రెజరర్ కే రవికుమార్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పి రాజశేఖర్, డివిజన్ ఆఫీస్ సెక్రటరీ పి సునీల్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చించు సంతోష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి గారు మరియు తొర్రూర్ డివిజన్ కార్మికులు డోలు వెంకటస్వామి, సైదులు, యాకుబ్ రెడ్డి, లింగారెడ్డి, సతీష్ ,హరిప్రసాద్, ఖాజాబీ, సంధ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్.!

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ కన్వీనర్ గా గోనె ఎల్లప్ప

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

అవయవ దానం అత్యున్నత మైన దానమని, మానవత్వంతో అమరత్వం పొందవచ్చునని, మరణానంతర జీవం మరణించి జీవించవచ్చని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిరిసిల్ల వాసి గోనె ఎల్లప్పను తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల(TEOBDA) సంఘం జిల్లా కన్వీనర్ గా డాక్టర్ అశోక్ నియమించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో గోనె ఎల్లప్పకు సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా నియామక పత్రాన్ని అందజేశారు, వారు సిరిసిల్ల జిల్లాలో అవయవదానంపై అవగాహన, నేత్రదానాలు, దేహదానాలు ప్రోత్సహించవలసి ఉంటుందని, ఈ పదవి మూడు సంవత్సర కాలం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా పనిచేయవలసి ఉంటుందని డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50 శాతంకు పైగా ఉన్న బీసీల పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏమిటని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో గులాబీ దళపతి..మాజీ సీఎం కేసీఆర్ తన సుదీర్ఘ ప్రసంగంలో బీసీల ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో..రాష్ట్రంలో బీసీ వాదం రోజురోజుకు పెరిగిపోతుంటే..బీసీల్లో వచ్చిన చైతన్యం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ..చట్టం చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో ప్రతి అంశంపై మాట్లాడిన కేసీఆర్..బీసీల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని..బీసీలు అంటే కేసీఆర్ కు అంతా అలుసా అని మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ప్రశ్నించిన కేసీఆర్..బీసీల హక్కులు, డిమాండ్లపై ఎందుకు నిలదీయలేదన్నారు. బీసీ బిల్లు అమలుపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించి..బీసీ బిల్లు అమలు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేస్తే బీసీలు హర్షించే వారని తెలిపారు. బీసీ బిల్లును గవర్నర్ వద్దకు పంపకుండా..కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. బీసీల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగేదన్నారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కేసీఆర్ ఇవ్వాల్సిందన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు..బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు..మొదట జీవోలు జారీచేసి ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తెలంగాణలో బీసీ బిల్లు అమలు కాకుండా ఉండేందుకు కొందరు కోర్టుకు వెళితే..సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే..అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి సవరణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచిస్తే..బీసీలు..బీఆర్ఎస్ ను ఆదరించేవారన్నారు. బీసీల ప్రస్తావన లేకపోవడంతో..బీసీలు..కేసీఆర్, బీఆర్ఎస్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.

తెలంగాణ జన సమితి పార్టీ.!

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా
జెండా ఎగరవేసిన

తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్చార్జ్ ఎలిశాల రాజేష్

వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లంద గ్రామంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఎలిశాల రాజేష్ ఇంటి ఆవరణలో జెండా ఎగరవేసిన సందర్భంగా ఎలిశాల రాజేష్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో పోరాటాలకు పిలుపునిచ్చి రాష్ట్రాన్ని సాధించినం సబ్బండ వర్గాల ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆశయాలతో ముందుకు వెళతామని ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటం చేస్తూ వారి వెంట ఉంటామని తెలియజేస్తూ ఏడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట మండల నాయకులు పెద్దూరు నాగరాజు పరకాలఅజయ్ కుమార్ పాల్గొన్నారు.

తెలంగాణ జన సమితి పార్టీ.!

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా
జెండా ఎగరవేసిన

తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్చార్జ్ ఎలిశాల రాజేష్

వర్దన్నపేట (నేటిదాత్రి ):

 

తెలంగాణ జన సమితి పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లంద గ్రామంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఎలిశాల రాజేష్ ఇంటి ఆవరణలో జెండా ఎగరవేసిన సందర్భంగా ఎలిశాల రాజేష్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో పోరాటాలకు పిలుపునిచ్చి రాష్ట్రాన్ని సాధించినం సబ్బండ వర్గాల ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆశయాలతో ముందుకు వెళతామని ప్రజల పక్షాన ఎప్పటికీ పోరాటం చేస్తూ వారి వెంట ఉంటామని తెలియజేస్తూ ఏడవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ వర్ధన్నపేట మండల నాయకులు పెద్దూరు నాగరాజు పరకాలఅజయ్ కుమార్ పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది.

తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయింది
– సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

 

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతో ఆ పార్టీకి సంబంధం తెగిపోయిందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణను స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదలు దోచుకున్నారని అన్నారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సిన కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పట్టించుకోవడంలేదని, అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతుల పక్షాన నిలబడడం లేదని మండిపడ్డారు.
ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ టీఆర్ఎస్ పార్టీదో లేక బీఆర్ఎస్ పార్టీదో కేసీఆర్ స్పష్టత ఇచ్చి వరంగల్ కు వెళ్లాలని కేకే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడా స్పష్టత ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బావ, బావమరుదులు నాడు కుర్చీ కోసం నేడు పార్టీ కోసం కుస్తీ పడుతున్నారని, హరీష్ రావుకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతే పడుతుందని కేకే జోష్యం చెప్పారు. వరంగల్ సభలో పార్టీలో హరీష్ రావు స్థానం ఏంటో కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని, కుర్చీల కొట్లాటలో హరీష్ రావు బీఆర్ఎస్ నుండి బయటకు రావడం ఖాయమన్నారు. తెలంగాణను నయవంచన చేసిన వాళ్లే ఆ పార్టీలో ఉన్నారని, కార్యకర్తలకు అది బీఆర్ఎస్ పార్టీయో, టీఆర్ఎస్ పార్టీయో తెలియదన్నారు. సంపాదించిన అవినీతి సొమ్ముతో రజతోత్సవ సభకు ప్రజలను తరలిస్తున్నారని, సభకు వచ్చేవారు కదిలివచ్చే జనం కాదని, కదిలిస్తే వచ్చే జనం అని విమర్శించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా నాయకుడు యేళ్లే లక్ష్మీనారాయణ, వైద్య శివప్రసాద్, కత్తెర దేవదాసు, శ్రీనివాస్ రవి, మహిళా నాయకురాలు కల్లూరు చందన, వనిత తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను.!

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి -భావండ్లపల్లి యుగంధర్ డిమాండ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హోంగార్డుల పక్షాన (డిసిపి)డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈసందర్భంగా ఎఐవైఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ గత పదకోండు సంవత్సరాలుగా తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్ లో విధులు, అదే విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలక్ట్ అయినారు. రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయారని, అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగినా, హోంగార్డులను మార్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారని, ఆకుటుంబాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. దీనివలన వారు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో, కుటుంబం తెలంగాణలో ఉండటంవలన, మానసికంగా, కుటుంబపరంగా, విధులకి హాజరుకావడానికి, రవాణాపరంగా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోంగార్డుల తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, వారి బాగోగులు చూసుకోలేకపోతున్నారన్నారు. కొంతమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో విద్యను కొనసాగిస్తున్నారనివారు భవిష్యత్తులో తెలంగాణ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జూన్ 2014 నుంచి దాదాపుగా పదకోండు సంవత్సరాలుగా స్వరాష్ట్రాలకు వెళ్ళాలని ఎదురుచూస్తున్నా, వారి సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని వాపోయారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కు హోంగార్డ్స్ బదిలీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ స్పందించటంలేదన్నారు. తెలంగాణ హోంగార్డులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణకీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో రాజేష్, నగేష్, మురళి, విజేందర్, సురేందర్, సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్.!

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్. జూనియర్ కాలేజీలో అత్యుత్తమ ఫలితాలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గల. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ సిరిసిల్ల .1. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనార్టీ విద్యార్థులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని అందులో భాగంగా. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో భాగంగా. Bush ra.kouser. కు.470.465. వచ్చాయని. అలాగే.నవిత.కు.470.460. సాధించారు.Bipc . విభాగం నందు. సంవత్సర. విభాగంలో నందిని. 440.గాను 431. అలాగే సన. సచ్చిరి నా. 440 ద్వితీయ సంవత్సరం విభాగంలో ఎంపీసీ.sodi ya.noushir.కి. 1000.కి గాను.895. సాధించారు మిగతా విద్యార్థులు1000.కి గాను.872. అలాగే. ఇంకో విద్యార్థి.1000. గాను.871. మార్కులు సాధించారు.Bpc . విభాగమునకు.J. స్నేహ కు.1000.గాను..982. మార్కులు మిగతా విద్యార్థికి 1000 కి గాను. 991. మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు అలాగే ఉపాధ్యాయులు మాట్లాడుతూ మేము బోధించడం ఒకటైతే విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఇంకా ముందు ముందు ఫలితాలు సాధించాలని విద్యార్థులు ఇటువంటి ఫలితాలు సాధించడం మైనార్టీ పాఠశాలకు గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ.!

కాశ్మీరం ఉగ్ర చర్య పై ఖండించిన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంస్థ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనాపాల శంకరయ్య కార్యనిర్వహణలో కాశ్మీరంలో జరిగిన ఉగ్ర చర్యను ఖండిస్తూ స్వర్గస్తులైన వారికి మౌనం పాటిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ కఠిన చర్యలు ఉగ్రవాదుల మీద గైకొనాలని ప్రభుత్వం నేడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండకూడదని పేర్కొన్నారు. డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా పోతున్నదని ఇలా అయితే శాంతికి విఘాతం కలుగుతుందని వాపోయారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ స్వర్గస్తులైన వారికి సద్గతులు ప్రాప్తించాలని వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దొంత దేవదాస్ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కాశ్మీరంలో శాంతిని నెలకొల్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి.!

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

ఏప్రిల్ 27న ఎల్కతుర్తి లో జరగబోయే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సభను రజక సంఘo కుల బంధువులు, రజక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఈరోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి (చందు)ఆధ్వర్యంలో తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్, ముస్తబాద్ మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ బిసినెస్ సెల్ కన్వీనర్ నమిలి నరసింములు,యూత్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజు యకయ్య,బీఆర్ఎస్ నాయకులు మచ్చ రవీందర్,పిల్లల తిరుపతి, ఒరుగంటి రమేష్ రజక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్.!

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్
తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సభలో చాటాలి

-స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దే ఘన విజయం

-కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి

-మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

 

ఓరుగల్లు గడ్డమీద జరగనున్న 27వ రజతోత్సవ సభలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాలని సర్పంచ్ ల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
బీఆర్ఎస్ నాయకత్వానికి పిలుపునిచ్చారు. శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సబ్బండ వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. నాడు అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారని, నేడు రైతన్నలు మొదలు ప్రతి ఒక్క రంగానికి చెందిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హావా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుండేదని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రజతోత్సవ సభ నాందిగా నిలవాలని వ్యాఖ్యానించారు. మొగుళ్లపల్లి మండలంలోని ప్రతి గ్రామం నుండి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్.!

ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్య మకారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ

ఉద్యమకారులు అందరూ తరలిరావాలి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం( టి యు ఎఫ్) మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్ ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 21 తెలంగాణ ఉద్యమ కారుల ప్లీనరీ పోస్టర్ ఆవిష్క రించడం జరిగింది.ప్లీనరి సమా వేశానికి పాల్గొనడం కోసం చర్చించడం జరిగింది. ఉద్యమకారులు ప్లీనరీ సమావే శానికి తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గజ్జి శంకర్ ,ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడిశెట్టి గణేష్ మండల అధ్యక్షులు పోలపెల్లి శ్రీనివాస రెడ్డి బలిజేనరసింహారాములు, గంట శ్యాంసుందర్ రెడ్డి , ఉద్య మకారులఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చీమ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారి సురే ష్, మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస రెడ్డి,ఉపాధ్య క్షులు వనం దేవరాజ్ ,మండల నాయకులు ఎండి రఫీ ,అడుప ప్రభాకర్, సముద్రాల లింగ మూర్తి, కానుగుల నాగరా జ్ ,తుమ్మ ప్రభాకర్, దూదిపాల జోగిరెడ్డి ,అరకిల వీరయ్య, కోలఆనందం, బాసని సాంబమూర్తి ,బత్తుల రాజేష్, కొడపాక సంజీవరావు శంకర్ రెడ్డి బొంతల నాగరాజు శాయంపేట టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్, దామర కొండ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలు విజయవంతం చేయండి

గోడ పత్రిక ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలో రాష్ట్రమహాసభల వాల్ పోస్టర్స్ జిల్లా కమిటీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఈనెల ఏప్రిల్ 25 ,26, 27 ,తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంనర అవుతున్న కూడా విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్లో ఉన్న దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నారన్నారు రాష్ట్రానికి ఇప్పుటీ వరకు విద్యశాఖ మంత్రి లేరన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు .

ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులతో చర్చించి రాబోవు భవిష్యత్తు కార్యాచరణలను ఎజెండాలను ఎంచుకొని భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు.ఈమహాసభలకు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సామల్ల సాయి భరత్, కడారీ శివ, నాయకులు శ్రీధర్, రాబిన్సన్, సాయి, చరణ్,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము
– బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత
– కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

సిరిసిల్ల, ఏప్రిల్ 

ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.

education

ఈ సందర్భంగా మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ
2019 బ్యాచ్ ఎంబిబిఎస్ స్టూడెంట్స్ కు డాక్టర్లుగా మారబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నా చిన్నతనంలో మా అమ్మ కూడా నేను డాక్టర్ కావాలని కోరుకుందని అన్నారు.
వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కెసిఆర్ నాకు చెప్పారు.
డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50 శాతం జబ్బు నయమవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద చాలెంజ్ ఎదురు కాబోతుందని అన్నారు.
చాట్ జిపిటి , గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు కూడా రాస్తున్నాయని అన్నారు.
ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కరుణ, సానుభూతితో రోగులకు డాక్టర్లు సేవ చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.
ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు.
హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చామని అన్నారు.
వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది.

తెలంగాణ ఉద్యమకారుడికి నివాళిర్పించిన పెద్ది

కొత్తగూడ, నేటిధాత్రి:

 

తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తొట్టి సత్యంగారి కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తగూడ మండలం పొగల్లపల్లి గ్రామ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు తొట్టి సత్యం ఈరోజు అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక ఖా యాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు తొట్టి సత్యం తెలంగాణ ఉద్యమాకారుడుగా రాష్ట్ర సాధనలో మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు ఈరోజు వారి మృతి పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు
ఆయన వెంట లో మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, మల్లయ్య మాజీ సర్పంచ్, భానోత్ వీరన్న, అజ్మీర రవి, మాజీ పడాల నాగేశ్వరరావు, ఎంపిటిసిలు బంగారు నారాయణ, ననుబోతుల స్వప్న లింగన్నయాదవ్,దానం నారాయణ, గుల్లపల్లి శీను , మండల్ నాయకులు కొనకంచి నాగమల్లేశ్వరరావు, నామోజు కనకాచారి, కావట్టి సతీష్ మల్లేష్ యాదవ్, కొలిపాక సదానందం, కత్తుల కుమారస్వామి, సంఘీ కుమారస్వామి ,భూక్య సంతోష్, నామోజు కనకాచారి గుంటుక యాకయ్య పల్లె శివ భైరబోయిన చిరంజీవి బోయిని భద్రయ్య ఆగబోయిన రాజయ్య మల్లేష్ యాదవ్ బండి లింగయ్య భైరబోయిన బుచ్చి రాములు బత్తుల ఉత్తరయ్య , పోతుగంటి రామాచారి, వేణు వంక కొమ్మలు, బోళ్ల యాకయ్యతో ,పాటు మండల నాయకులు పాల్గొన్నారు…

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ,.! 

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ, స్వపరిపాలన సిద్ధించింది. 

-ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగింది

-విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని అన్నారెడ్డి అన్నారు.

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు తెలంగాణ భవన్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది, సిరిసిల్ల బిఆర్ఎస్ పట్టణ మాజీ చైర్ పర్సన్ అధ్యక్షులు జిందం కళా చక్రపాణి పూలమాలవేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ అండ కలిగిన స్థానిక భూస్వాములు, దొరల అరాచకాల నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు మధ్య వీరోచిత పోరాటం చేశారు అని తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న, సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, కుంభాల మల్లారెడ్డి, తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version