మద్రాస్ రబ్బర్ లిమిటెడ్ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలుసిఐ రాజువర్మ
నేటిదాత్రి చర్ల
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలోని యువతకు సువర్ణ అవకాశం ప్రముఖ కంపెనీలైన మద్రాస్ రబ్బర్ (ఎంఆర్ ఎఫ్ ) రేన్( మద్రాసు)లిమిటెడ్ కంపెనీలో 120 పొస్టులకు గాను శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నెల10న ఖమ్మం కలెక్టరేట్ లో జరిగే ఎంపికకు అర్హత కలిగిన అభ్యర్ధులు నేరుగా పాల్గొనాలని తెలిపారు వయస్సు 18సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగిఉండాలని అర్హత 10 తరగతి ఇంటర్ ఐటిఐ చేసిన ( పురుషులు) నిరుద్యోలకు సువర్ణ అవకాశం అని అన్నారు శిక్ణణ కాలం 2 సంవత్సరాలు ఉంటుందని పని సయమం ఎనిమిది గంటలు ఉంటుందని శిక్షణ సమయంలో మంచి జీతం ఇవ్వటంతోపాటు భోజనం వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు ఆసక్తి గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరింత సమాచారం కొరకు స్ధానిక పొలీస్ స్టేషన్లో సంప్రదించాలని సి ఐ రాజువర్మ నిరుద్యోగ యువతకు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు
