రాష్ట్రస్థాయిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీలు…

రాష్ట్రస్థాయిలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీలు

కొలనూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు రాష్ట్రస్థాయి ర్యాంకులు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మొదటి సంవత్సరం , ఫలితాల్లో కొలనూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలకు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. గోరంటాల ధరణి బైపీసీ లో రాష్ట్రస్థాయిలో ఆరవ ర్యాంకును, గోరంటాల పూజ MPHW -1లో రాష్ట్రస్థాయి 8వ ర్యాంకులు మరియు గోరంటాల పల్లవి MPHW -1లో రాష్ట్రస్థాయి పదో ర్యాంకును సాధించారు.అత్యధిక మార్కులను సాధించిన వారిని కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ మరియు అధ్యాపకులు విద్యార్థులను శాలువాలతో వారిని అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా కష్టపడి అత్యధిక మార్కులు సాధించాలని, ఉన్నత చదువులు చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు తెలిపారు .

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

ఫస్ట్ ఇయర్ లో వరుస స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు.

ఇంగ్లీష్ లో 100 కు 100 మార్కులు సాధించిన విద్యార్థి

సెకండ్ ఇయర్ లో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ

కోదాడ, నేటి ధాత్రి :

ఇంటర్మీడియట్ ప్రధమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఫస్ట్ ఇయర్ లో వరుసగా 468, 467, 466, 465 మార్కులు సాధించి వరుస స్టేట్ ర్యాంకులు సాధించారు. కాలేజ్ కు చెందిన వేముల వెంకట విశాల్ 468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు. 467 మార్కులతో డి చరిష్మా, ఎస్ విమల లు స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాడు. వైష్ణవి 466, అంజనీ 465 లు మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో వీరు 432 మార్కులు సాధించాడు. సెకండ్ ఇయర్ లో అమృత సుధా వర్షిణి 988, లక్కం రక్షిత 987, ఎరబోలు శరణ్య 986 మార్కులు సాధించారు.
ఇంగ్లీష్ పేపర్ లో 100 మార్కులు సాధించిన విద్యార్థి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లో కాలేజ్ కి చెందిన ఎస్ విమల 100కు 100 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా ఇంగ్లీష్ పేపర్ లో 100 కు 100 మార్కులు సాధించడం తమ కాలేజ్ కు గర్వకారణమని ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు. ఈ ఫలితాల మాదిరిగానే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలలో జాతీయ స్థాయి ర్యాంకు లు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ , పీఆర్వో మల్లికార్జున రావులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version