ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

ఫస్ట్ ఇయర్ లో వరుస స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు.

ఇంగ్లీష్ లో 100 కు 100 మార్కులు సాధించిన విద్యార్థి

సెకండ్ ఇయర్ లో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ

కోదాడ, నేటి ధాత్రి :

ఇంటర్మీడియట్ ప్రధమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఫస్ట్ ఇయర్ లో వరుసగా 468, 467, 466, 465 మార్కులు సాధించి వరుస స్టేట్ ర్యాంకులు సాధించారు. కాలేజ్ కు చెందిన వేముల వెంకట విశాల్ 468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు. 467 మార్కులతో డి చరిష్మా, ఎస్ విమల లు స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాడు. వైష్ణవి 466, అంజనీ 465 లు మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో వీరు 432 మార్కులు సాధించాడు. సెకండ్ ఇయర్ లో అమృత సుధా వర్షిణి 988, లక్కం రక్షిత 987, ఎరబోలు శరణ్య 986 మార్కులు సాధించారు.
ఇంగ్లీష్ పేపర్ లో 100 మార్కులు సాధించిన విద్యార్థి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లో కాలేజ్ కి చెందిన ఎస్ విమల 100కు 100 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా ఇంగ్లీష్ పేపర్ లో 100 కు 100 మార్కులు సాధించడం తమ కాలేజ్ కు గర్వకారణమని ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు. ఈ ఫలితాల మాదిరిగానే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలలో జాతీయ స్థాయి ర్యాంకు లు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ , పీఆర్వో మల్లికార్జున రావులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కోదాడ రేస్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం…

కోదాడ రేస్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

చైర్ పర్సన్ బాణాల వసంత రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి :

ఇంటర్మీడియట్ ఫలితాల్లో కోదాడ రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన రెడ్డి శ్రీ తేజన్య ఎంపీసీ విభాగంలో 470కి 468 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకు పొందగా, సిహెచ్ యామిని 467 మార్కులతో ద్వితీయ ర్యాంకు సాధించారు.అలాగే ఎన్. మౌనిక, జి. భవ్య శ్రీ, ఆర్. శ్రీనిజా రెడ్డి, జైనబ్‌లు 466 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ బాణాల వసంత రెడ్డి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల, కఠోర శ్రమ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యార్థుల విజయానికి తోడ్పడిన అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version