శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ…

శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట నియోజకవర్గ పరిధి శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా కోసం పట్టణంలోని కెఎస్‌ఆర్ కాన్సెప్ట్ స్కూల్‌లో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు కొరిటాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి భూసాని రమేష్ మీడియాతో మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ జాబ్ మేళాను నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.
కోశాధికారి మచ్చిక రవితేజ కార్యక్రమంలో యువతకు ప్రోత్సాహం అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ కన్నబోయిన రమేష్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ఊరేటి శివకుమార్, నర్సంపేట మండల అధ్యక్షులు అజ్మీర రాజ నాయక్, దుగ్గొండి మండల అధ్యక్షుడు జాను అజయ్,నర్సంపేట నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పొనుగోటి త్రినేష్ రావు, నిమ్మగడ్డ నాగార్జునతో పాటు ఇతర కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version