కేసీఆర్‌కు ఏమైంది?

కేసీఆర్‌కు ఏమైంది?

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ స్పీచ్ అంటే ఒక తుపాన్.. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించే విమర్శల జడివాన! కానీ, జగిత్యాల గడ్డపై జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ అధినేత చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది
స్పీచ్ లో కేసీఆర్ కాళేశ్వరం ప్రస్తావన తీసుకు రాలేదు. ఓ వైపు కాళేశ్వరం పేరుతో..మేడిగడ్డ పేరుతో రేవంత్ రెడ్డి మిస్సైల్స్ వదులుతూంటే.. కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం జగిత్యాల సభలో ఆయన స్పీచ్ చప్పగా ఉందన్న అభిప్రాయం రావడానికి కారణం అవుతోంది. అసలు సంబంధం లేని హైడ్రాను తీసుకు వచ్చి అధికారంలోకి రాగానే తొలి సంతకం.. హైడ్రా రద్దు మీద పెడతానని చెప్పడం కేసీఆర్ రాజకీయాల్లో తనదైన టచ్ కోల్పోతున్నారని అనిపించడానికి కారణం అవుతోంది.

స్పీచ్ లో ఫ్లాష్ బ్యాక్’ కథలకే ఎక్కువ టైమ్ కేటాయించారు. కాంగ్రెస్ ఏం చేయలేదు చెప్పారు. అసలు ఇప్పుడు తాను లేకపోవడం వల్ల జనం కరువులో ఉన్నారని బాధపడే ప్రయత్నం చేశారు. పాత విషయాలన్నీ చెప్పుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తనదైన శైలిలో చీల్చి చెండాడేందుకు మాత్రం ఆయన ఎక్కువ సమయం కేటాయించలేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టాక గెలవని జీవన్ రెడ్డిని ఓ గొప్ప నాయకుడిగా ఎలివేట్ ఇస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం చూసే వారికే .. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకే ఇబ్బందికరంగా మారింది. కేకేకు ఇచ్చినట్లుగా సెక్రటరీ జనరల్ పదవి ఇస్తారని అనుకున్నారు కానీ.. ఆయనకు రాష్ట్ర స్థాయిలో అవసరం లేదని.. ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి.. జగిత్యాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలు చూసుకోవాలని చెప్పారు. అంటే.. కేకే స్థాయి లేదని కేసీఆర్ చెప్పినట్లయింది.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రత్యర్థులు తన చావు కోరుకుంటున్నారనే సెంటిమెంట్ పాట కేసీఆర్‌కు కామన్ అయిపోయింది. ఈ సభలోనూ అదే రిపీట్ అయింది. తన చావు కోరుకుంటున్నారని.. అలా కోరుకునేవారు వెయ్యి జన్మలెత్తినా తాను పోనన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎంత వరకూ ఉపయోగమో కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం సభను విజయవంతం చేసేందుకు గట్టి ప్రయత్నం చేశారు. వచ్చినప్పటి నుండి సీఎం కేసీఆర్ అనే నినాదాలు ఇప్పించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే కార్యకర్తలు కేటీఆర్ వస్తే కేటీఆర్ సీఎం అని అరుస్తారు. ఇలాంటివి రాజకీయంగా పెద్దగా వర్కవుట్ అవ్వవు. ఒకప్పుడు కేసీఆర్ స్పీచ్ అంటే ఒక స్టాండర్డ్.. ఒక వైబ్! కానీ ఆవిర్భావ సభ నుంచి జగిత్యాల వరకు చూస్తే గులాబీ బాస్ ఆ మ్యాజిక్‌ను అందుకోలేకపోతున్నారు. బాస్ మళ్ళీ తన ‘సిగ్నేచర్ స్టైల్’ పుంజుకుంటారా.. లేక ఈ స్లో మోషన్ పాలిటిక్స్‌తోనే ముందుకు సాగుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version