టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా…

టీబీజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకులు

సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డును వెంటనే అమలు చేయాలి

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టిబిజికేఎస్ సంఘం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,టీబీజీకెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి,వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టిబిజికెఎస్ నాయకులు, బడిదల సమ్మయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత బిఆర్ఎస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలకు చట్టబద్దత లేని సమయంలో, 115 మెడికల్ బోర్డుల ద్వారా 13,119 మంది కార్మిక బిడ్డలకు కారుణ్య నియామకాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.
నేటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడాది కాలంగా (మార్చి 2025 నుండి) ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించకుండా 2000 మంది అనారోగ్యంతో ఉన్న కార్మికుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం అడుతుంది.

సింగరేణిలో ఇచ్చిన గ్యారంటీలు నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కడం అన్యాయం.
వారసత్వ ఉద్యోగాల వల్ల సింగరేణి కుంటుపడిందని చెప్పడం అబద్దం! ప్రభుత్వం చెల్లించాల్సిన 50 వేల కోట్ల బకాయిల వల్లే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
మారు పేర్ల విజిలెన్స్ అంశం పై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి.అక్టోబర్ 2025 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిపెండెంట్లకు ఉద్యోగ నియమక పత్రలు వేంటనే ఇవ్వాలి.
బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైకరి నశించాలి..
తెలంగాణ బొగ్గు గణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ సంఘం పిలుపునిచ్చారు

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం…

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం
నేటి ధాత్రి : శ్రీరాంపూర్

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) విఫలమైందని, ఎఐటియుసి యూనియన్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన గత రెండు సంవత్సరాల నుండి కార్మిక వర్గ పక్షాన పోరాడకుండా మౌనం వహించిందని ఐఎన్టియుసి సీనియర్ ఉపాధ్యక్షులు ధర్మపురి, సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు ఆరోపించారు. సోమవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ యూనియన్ సింగరేణి, ప్రభుత్వ కార్యకలాపాలలో ఇతర యూనియన్ లను దగ్గరకు రానివ్వలేదని విమర్శించారు. సన్మానాలు, గుడి కమిటీ, క్యాంటీన్ కమిటీలకు సంబంధించిన హక్కులు అనుభవిస్తూ, ఇతర సంఘాలు మీటింగ్ లు పెడితే చార్జిషీట్లు, సస్పెండ్ లకు గురిచేస్తూ, విజిలెన్స్ పేరిట దాడులు చేయించారన్నారు. కార్మిక వర్గం నష్టపోతుంటే ఏ రోజు కూడా మౌనం వీడని సంఘమని అన్నారు. భూపాలపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు లోపు కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రకటించే తరుణంలో దీనిని దృష్టిలో ఉంచుకొని ఏఐటియుసి నల్ల బ్యాడ్జీలు, ధర్నాలు, బస్సు జాత పేరిట రకరకాల విన్యాసాలకు పాల్పడుతుందని ఐఎన్టీయూసీగా భావిస్తున్నామని అన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాల మూడు నెలల కాలం గడిచిందని, ఈ కాలంలో ఏఐటీయూసీ కార్మికుల కొరకు ఈ డిమాండ్లు తీసుకొచ్చామని, ఈ అగ్రిమెంట్లు చేశామని చెప్పిన పాపాన పోలేదని విమర్శించారు. నేడు సేవ్ సింగరేణి జాతాను ప్రారంభించి కార్మిక వర్గాన్ని అయోమయానికి గురి చేస్తుందని ఆరోపించారు. ఏఐటియుసి గుర్తింపు సంఘం పదవీకాలంలో నాలుగు కార్మిక వ్యతిరేక సర్క్యులర్లు వచ్చాయని, వాటిని ఎందుకు అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. 2012, 2017 సంవత్సరాలలో ప్రాతినిధ్య సంఘంగా ఎఐటియుసి ఉన్నప్పుడు, టిఆర్ఎస్, టీబీజీకేస్ రూ. 29 వేల కోట్లు అప్పు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వీరిద్దరూ పదవీకాలంలో ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగుల పిల్లలు 300 మంది మూడు సంవత్సరాలుగా ఆర్డర్ ఇవ్వక ఇబ్బంది పడుతుంటే, జనక్ ప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వారందరికీ ఆర్డర్లు ఇప్పించిన మాట నిజం కాదా అని అన్నారు. గుర్తింపు సంఘం కాకున్నా, ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంగ్రెస్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు భీమ్రావు, సీనియర్ నాయకులు గరిగస్వామి, తిరుపతి రాజు, రవీందర్ రెడ్డి, మారేపల్లి బాబు, రౌతు సత్యనారాయణ, నంబన్న, భీమన్న, శ్రీధర్ పాల్గొన్నారు.

ఏప్రిల్ లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలి…

ఏప్రిల్ లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలి

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

కార్మిక సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలి ఏప్రిల్‌లో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయండి: కొరిమి రాజ్‌కుమార్, జనరల్ సెక్రటరీ కొమురయ్య భవన్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలతో తిరిగి సాధించుకున్న మెడికల్ బోర్డు నిర్వహణను గత సంవత్సరం ఏసీబీ కేసు నమోదైందని సాకుగా చూపుతూ నిలిపివేయడం తీవ్రంగా ఖండనీయమని ఆయన పేర్కొన్నారు.
సుమారు పది నెలలుగా అనారోగ్య కారణాలతో డ్యూటీలు చేయలేక మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులను పిలవకపోవడం, పైగా వారిపై నిబంధనల పేరుతో చర్యలు తీసుకోవడం దుర్మార్గ చర్య అని అన్నారు. గుర్తింపు సంఘంగా ఈ సమస్యను ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు పాత పద్ధతిలో మెడికల్ బోర్డును కొనసాగిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలు చేయడంలో యాజమాన్యం విఫలమైందని తెలిపారు.
ప్రస్తుతం మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల డిపెండెంట్లు ట్రైనింగ్‌కు సిద్ధంగా ఉన్నవారు సింగరేణి వ్యాప్తంగా సుమారు 300 మంది ఉన్నారని, వారి కుటుంబాలను ఆర్థికంగా మరియు మానసికంగా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన తెలిపారు.
ఎఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత జరిగిన స్ట్రక్చర్ సమావేశాల్లో యాజమాన్యం ఒప్పుకున్న ఒప్పందాలను అమలు చేయకపోవడం, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడం జరుగుతోందని విమర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త గనులు ప్రారంభం కాకపోవడం, పాత గనులు మూతపడటం, అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన ₹50 వేల కోట్ల బకాయిలు రాకపోవడం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని పేర్కొన్నారు.
ప్రారంభించాల్సిన బొగ్గు గనులను ప్రారంభించకుండా కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని సాకుతో యాజమాన్యం చేతులెత్తేయడం సమంజసం కాదని రాజ్‌కుమార్ అన్నారు.
అలాగే సింగరేణి వ్యాప్తంగా జే ఎం ఈ టి ఎస్ గా పనిచేస్తున్న వారికి ఓవర్‌మెన్ ప్రమోషన్లు కల్పించాలని, ఎస్ ఎన్ పిసి పిఓఏ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్స్ తదితర విభాగాలలో ఖాళీలను అంతర్గత ఉద్యోగులతోనే భర్తీ చేయాలని, అన్ని క్యాడర్ స్కీములను సవరించాలని డిమాండ్ చేశారు. సాధారణ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు మరియు హైపవర్ కమిటీ నిర్ణయించిన జీతాలు అమలు చేయాలని కోరారు.
సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా జరిగిన కుంభకోణాలు, అవినీతి టెండర్లు, ఉత్పత్తి అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్లానింగ్ లోపాల వల్ల జరిగిన కోట్లాది రూపాయల నష్టంపై మరియు నైనీ బ్లాక్ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
కార్మిక సమస్యల పరిష్కారం కోసం మార్చి 17న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులలో ధర్నాలు, నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే మార్చి 18న శ్రీరాంపూర్ ఏరియా నుండి ప్రారంభమయ్యే “సేవ్ సింగరేణి జాతా” ద్వారా అన్ని ఏరియాలలో కార్మికులను చైతన్యపరుస్తూ మార్చి 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద జరిగే జాతా ముగింపు సభను జయప్రదం చేయాలని కోరారు. అదే విధంగా ఏప్రిల్ నెలలో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో భూపాలపల్లి బ్రాంచ్ సెక్రటరీ మోట పలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు జి. సుధాకర్ రెడ్డి, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version