ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయం వద్ద పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణంలో ఉన్న భక్త మార్కండేయ ఆలయం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శివలింగానికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం గణపురం మండలం చెల్పూరు గ్రామంలో పద్మశాలి కుల బాంధవులు నిర్వహించిన భక్త మార్కండేయ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, పద్మశాలి కుల వంశోద్ధారకుడు, ధర్మ పరిరక్షకుడు అయిన భక్త మార్కండేయుని జయంతిని ఘనంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. చిన్న వయస్సులోనే శివభక్తితో సత్య–ధర్మ మార్గంలో నడిచి మృత్యువును జయించిన మహానుభావుడిగా ఆయన ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. పద్మశాలి కులం ఐక్యంగా నిలిచి విద్య, ఉపాధి, సామాజిక సేవల రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగవతం బిక్షపతి, గోనె భాస్కర్, శేరు కుమారస్వామి, గుండ వీరస్వామి, పేరాల వెంకటేశం, పాసికంటి శ్రీనివాస్, కుసుమ కృష్ణమోహన్, భీమనాధిని సత్యనారాయణ, తౌటం ప్రభాకర్, అంకం నర్సయ్య, మామిడాల రవీందర్ లతొ పాటు తదితరులు పాల్గొన్నారు.
