అక్షర కాన్సెప్ట్ స్కూల్ లో సంఘటనను పక్కదారి పట్టిం చారు..

అక్షర కాన్సెప్ట్ స్కూల్ లో సంఘటనను పక్కదారి పట్టిం చారు

బీ ఆర్ ఎస్ మీడియా ఇంచార్జి అశోక్
వనపర్తి నేటిదాత్రి .

 

కాంగ్రెస్ నాయకులు మైనార్టీ ప్రజల కు క్షమాపణ చెప్పాలని బి.ఆర్.ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ నాయకులు మెకానిక్.శ్రీను, జోహెబ్ హుస్సేన్,అస్లాం అన్నారు వనపర్తి పాన్ గల్ రోడ్డులో అక్షర ప్రవేట్ స్కూల్ లో మైనార్టీ చిన్నారి పై జేరి గిన సంఘటన పై అండగా ఉండాల్సి పోయి అడ్డగోలు ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తు న్న రని వారు పేర్కొన్నారుసంఘటన జరగకముందు గాని జరిగిన తర్వాత గాని ఒక్క నాడైనా అక్షర స్కూల్ లోకి వెళ్ళడం గాని యాజమాన్యంతో మాట్లాడడం గాని జరగలేదని అశోక్ తెలిపారు. తన ఇంటి ముందు స్కూల్ పై దాడి జరుగుతుందంటే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్లా మని ఇది తప్పా అని అశోక్ ప్రశ్నించారు. దమ్ము దైర్యం ఉంటే అక్షర స్కూల్ యాజమాన్యంతో నేనుగాని మా నాయకులుగాని డబ్బులు అడిగినట్లు నిరూ పి స్తే వనపర్తి రాజీవ్ చౌరస్తాలో బహిరంగ ఉరి వేసుకుంటామని సవాల్ విసిరారు.బీ ఆర్ ఎస్ నేతల పై ఆరోపణలు, విమర్శలు వేసిన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మరియు స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు ప్రజలు అఖిల పక్షా రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని పోరాడుతామని అశోక్ తెలిపారు
ఈ సమావేశములో నందిమల్ల.అశోక్,బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు మెకానిక్.శ్రీను, జోహెబ్ హుస్సేన్,యూసుఫ్,అస్లాం ఇమ్రాన్ బిన్ అలీ,మంద.రాము,జావేద్,అలీమ్,ముద్దసార్,ఖాదర్, ఫయ్యుం,నజీర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version