ఘనంగా సెయింట్ పీటర్స్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే..

ఘనంగా సెయింట్ పీటర్స్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక సెయింట్ పీటర్స్ హైస్కూల్ లో ఘనంగా ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎస్సై జి శ్రావణ్ కుమార్ కారల్ మార్క్స్ కాలనీ 24 వార్డు కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఆటలు పాటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అలాగే చిన్నారులలో ఉన్న విజ్ఞానాన్ని మేధాసంపత్తిని మరింత పెంపొందించుకునే అవకాశం ఉంటుందని వాళ్లకు వివరించడం జరిగింది .అదేవిధంగా చిన్నారులు చదువుతోపాటు ఆటలు, పాటలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి భవిష్యత్తులో భారతదేశ ఉన్నత భావిభారత పౌరులుగా ఎదగాలని దేశ సేవలో ముందుండాలని ఆకాంక్షించడం జరిగింది.
చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి వారు అన్నారు
ఈ కార్యక్రమంలో సెయింట్ పీటర్ స్కూల్ డైరెక్టర్ జార్జి కరస్పాండెంట్ జోసెఫ్ ప్రిన్సిపాల్ జానీ సెర్లీ జార్జ్ ,బినా సిస్లి అధ్యాపక బృందం, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version