అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో వసంత పంచమి పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలో అంగన్వాడీ టీచర్లు ఎన్.అనిత,డి.సంపూర్ణ, డి.వినోద,ఆయాలు,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
